వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకీ మౌనం :బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్న రద్దుచేసిన నోట్లెన్నీ

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా మిగిలిన రద్దుచేసిన నగదు ఎంత ఉందనేవిషయాన్ని ప్రకటించకుండా ఆర్ బి ఐ గోప్యత పాటిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేశారనే విషయాన్ని ప్రకటించిన ఆర్ బి ఐ, బ్యాంకుల్లో ఎంత నగదును ఇంకా డిపాజిట్ చేయకుండా మిగిలి ఉందనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ విషయమై ఆర్ బి ఐ ఇంకా మౌనాన్ని వీడడం లేదు. పెద్ద నగదు నోట్లను రద్దుచేసే నాటికి సుమారు 15.44 లక్షల కోట్లు రద్దుచేసిన నగదు మార్కెట్లో ఉంది.అయితే దీనిలో ఎంతమేరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. ఎంతమేరకు బయట ఉందనే విషయాన్ని మాత్రం ఆర్ బి ఐ స్పష్టం చేయలేదు.

పెద్ద నగదు నోట్ల రద్దు వెనుక ప్రత్యేకించి నల్లధనాన్ని నిర్మూలించాలనే ప్రత్యేక వ్యూహన్ని ప్రధానమంత్రి చేశారు.అయితే పెద్ద నగదు నోట్లను రద్దు చేయడం ద్వారా నల్లధనాన్ని నిర్మూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రధాని అభిప్రాయంతో ఉన్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని మార్పిడి చేసుకోనేందుకు అక్రమార్కులు అనేక మార్గాలను అన్వేషించారు.అయితే కొందరు ఈవిషయంలో పట్టుబడ్డారు. మరికొందరు ఆదాయపు పన్నుశాఖ, ఈడీ, సిబిఐ కేసుల్లో ఇరుక్కొన్నారు.ఇంకా ప్రభుత్వానికి చిక్కకుండా ఉన్నవారు కూడ లేకపోలేదని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద నగదు నోట్లను రద్దుకు ముందు తర్వాత వచ్చిన మార్పులను చెప్పాలని విపక్షాలు ప్రధానిని డిమాండ్ చేస్తున్నాయి. అయితే పెద్ద నగదు నోట్లను రద్దుచేసే సమయానికి అంచనామేరకు ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు ఎంత ఉందనే విషయాన్ని ఆర్ బి ఐ వెల్లడించలేదు.

రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఎంత ఉంది

రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఎంత ఉంది

గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను ప్రభుత్వం రద్దుచేసింది.అయితే ఈ నోట్లను రద్దు చేసే నాటికి సుమారు 15.44 లక్షల కోట్ల రూపాయాలు చలామణిలో ఉన్నాయని ఆర్ బి ఐ చెబుతోంది. అయితే గత ఏడాది డిసెంబర్ 30వ, తేది నాటికి రద్దుచేసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసే గదువు ముగిసింది.అయితే డిసెంబర్ 13 వ, తేది నాటికి సుమారు 12.44 లక్షల కోట్ల రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది.అయితే గడువు ముగిసిన తర్వాత కూడ రద్దుచేసిన గదు ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉందనే విషయాన్ని ఆర్ బి ఐ ప్రకటించలేదు.దేశ వ్యాప్తంగా ప్రతి బ్యాంకులు, కొనుగోళ్ళ ద్వారా జరిగిన డబ్బుల వివరాలు ఆర్ బి ఐ కి చేరుతున్నాయి. ఈ లెక్కల ఆధారంగా రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో ఎంత మేరకు డిపాజిట్ అయిందో ఆర్ బి ఐ లెక్కలు తీసింది.

 ఐదు లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కావు

ఐదు లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ కావు

పెద్ద నగదు నోట్లను రద్దుచేసే సమయంలో నల్లధనం కలిగి ఉన్న అక్రమార్కులు బ్యాంకుల్లో డబ్బులను డిపాజిట్ చేయకుండా ఉంటారనే అనుమానాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. ఈ ధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వాటికి సంబంధించిన ఆధారాలను చూపాల్సిన పరిస్థితులు వస్తాయి.పన్ను చెల్లించకుండా ఆదాయాన్ని సంపాదించినందుకుగాను జరిమానాలను చెల్లించాల్సి వస్తోంది. ఈ తలనొప్పుల కారణంగా సుమారు ఐదు లక్షల కోట్ల మేరకు బ్యాంకుల్లో రద్దుచేసిన నగదు డిపాజిట్ అయ్యే అవకాశం లేదని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఇదే విషయాన్ని తెలిపింది.

రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్న విషయమై గోప్యత ఎందుకు

రద్దుచేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్న విషయమై గోప్యత ఎందుకు

పెద్ద నగదు దర్దుచేసిన తర్వాత ఎంత నగదు రద్దుచేసింది ఇంకా బ్యాంకులకు చేరాల్సి ఉందనే విషయాన్ని బయటకు చెప్పకుండా ఆర్ బి ఐ గోప్యత పాటిస్తోంది. పెద్ద నగదు నోట్లను రద్దుచేసే సమయంలో తాము అంచనావేసిన దానికంటే తక్కువగా బయట ఉన్నా, ఎక్కువగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా తమ పరువుపోతోందనే ఉద్దేశ్యంతోనే ఆర్ బి ఐ గోప్యతను పాటిస్తోందా అనే చర్చ సాగుతోంది.అయితే ఈవిషయమై ఆర్ బి ఐ నుండి స్పష్టమైన సమాధానం రావడం లేదు.

మందగించిన ఆర్థిక కార్యకలాపాలు

మందగించిన ఆర్థిక కార్యకలాపాలు

పెద్ద నగదు నోట్లను రద్దుచేయడంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అసంఘటిత రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీని ప్రభావం జాతీయ స్థూల దేశీయ ఉత్పత్తిపై పడింది. సుమారు లక్షన్నర కోట్ల మేరకు ప్రతికూల ప్రభావం చూపిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ అనే సంస్థ అంచనావేసింది. దీనికితోడు కొత్త కరెన్సీ ముద్రించేందుకు రవాణా చేసేందుకు అదనంగా ప్రభుత్వంపై భారం పడింది.

లెక్కలు చూపిన నాలుగువేల కోట్లు స్వాధీనం చేసుకొన్న ఐ.టి డిపార్ట్ మెంట్

లెక్కలు చూపిన నాలుగువేల కోట్లు స్వాధీనం చేసుకొన్న ఐ.టి డిపార్ట్ మెంట్

నవంబర్ 8వ, తేది అర్థరాత్రి కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది.అయితే లెక్కలు చూపని ఆదాయాన్ని, ఇతరుల ఖాతాల్లో నగదును జమ చేసి మార్పిడి చేసుకొనే ప్రయత్నం చేసినవారిలో కొందరిని ఆదాయపు పన్నుశాఖాధికారులు పట్టుకొన్నారు. ఇంకా లెక్కలు చూపకుండా నగదును మార్చుకొనే ప్రయత్నం చేసినవారు ఉన్నారని ఆదాయపు పన్నుశాఖాధికారులు అభిప్రాయంతో ఉన్నారు.
దేశవ్యాప్తంగా 253 చోట్ల ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించి సుమారు 4,663 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు. పన్ను ఎగవేతకు సంబందించి 5,062 మందికి నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెప్పారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఈ మేరకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం భీమ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ రకమైన క్యాష్ లెస్ ట్రాన్స్ క్షన్ లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.డిసెంబర్ 26వ, తేదిన ఒక్క రోజే దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయాలు నగదు రహితంగా జరిగాయి.రానున్న రోజుల్లో నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించనుంది.

English summary
since the statement by the deputy governor on December 13, which said rs 12.44 lakh crore of the old rs 500 and rs 1000 notes (‘invalid notes’) had been received by the rbi or in currency chests,we are still very far away from the full replacement of the cash withdrawn from circulation, with such replacement falling well short of the halfway mark by December 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X