• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొవిడ్ వ్యాక్సిన్: చైనాకు ఊరట -సినోఫార్మ్ టీకాకు WHO అనుమతి -79శాతం సమర్థత

|

చైనాలో తయారయ్యే వస్తుల క్వాలిటీలాగే అది అభివృద్ది చేసిన కొవిడ్ టీకాలు కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిని కొనడానికి మిగతా దేశాలేవీ ముందుకు రావట్లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కరోనా రెండో దశ విలయంలో చాలా దేశాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బందిపడుతోన్న నేపథ్యంలో మళ్లీ అందరి దృష్టి చైనా వైపు మళ్లింది. ఇండియా సైతం చైనా టీకాలను కొనుగోలు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతోన్న వేళ..

షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..

చైనాకు చెందిన ప్రఖ్యాత సినోఫార్మ్‌ సంస్థ అభివృద్ది చసిన కొవిడ్ వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ కేసుల్లో వాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. సినోఫార్మ్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ 79శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలడం, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలనూ సాధించిన నేపథ్యంలో ఈ మేరకు అత్యవసర వాడకానికి అనుమతి లభించింది.

 WHO approves Chinas Sinopharm Covid-19 vaccine for emergency use, has 79% efficacy

చైనా వ్యాక్సిన్ కు అనుమతి లభించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముందని, భారీ ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సత్తా చైనాకు ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్ మరియంజెలా సిమో పేర్కొన్నారు. కొవాక్స్‌ ఫెసిలిటీలో పాల్గొని, మరింత సమానమైన వ్యాక్సిన్‌ పంపిణీ లక్ష్యానికి దోహదం చేయాలని మేం తయారీదారుడిని కోరుతున్నట్లు తెలిపారు.

సీఎంగా 2వరోజే స్టాలిన్ సంచలనం -తమిళనాడులో పూర్తి లాక్‌డౌన్ -మే10 నుంచి రెండు వారాలపాటుసీఎంగా 2వరోజే స్టాలిన్ సంచలనం -తమిళనాడులో పూర్తి లాక్‌డౌన్ -మే10 నుంచి రెండు వారాలపాటు

చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ (సీఎన్‌బీజీ) అనుబంధ సంస్థ బీజింగ్‌ బయో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రోడక్ట్స్‌ కో లిమిటెడ్‌ సినోఫార్మ్‌ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సినోఫార్మ్ టీకాలను 18 ఏళ్ల అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వేసేందుకు సిఫారసు చేసింది. మొదటి రెండో డోసుకు మధ్య నాలుగు వారాల గడువు ఉంటుంది.

ఇప్పటి వరకు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా ఎస్కే బయో, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా టీకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అత్యవసర వినియోగానికి అనుమతి పొందాయి. తాజాగా సినోఫార్మ్ వ్యాక్సిన్ కూ అనుమతి లభించడంతో ఇతర దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకునే వీలు ఏర్పడింది. భారత్ కు సంబంధించి దేశీయంగా తయారైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ కు తోడు రష్యా తయారీ స్ఫుత్నిక్ వి టీకాకు కేంద్రం అనుమతిచ్చింది. ఫైజర్ అభ్యర్థన పరిశీలనలో ఉంది. చైనా వ్యాక్సిన్లపై భారత సర్కార్ ఇప్పటిదాకా ఎలాంటి ఆలోచన చేయలేదు.

English summary
In a big relief for China, the WHO on Friday finally granted the conditional approval to its Sinopharm COVID-19 vaccine for emergency use, a move that could help Beijing step up its vaccine diplomacy amid the surge in coronavirus vaccines in several countries. China has approved about five of its vaccines for emergency use and especially using Sinopharm and Sinovac vaccines for both at home and abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X