వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కూ, ప్రధాని మోడీకి WHO థ్యాంక్స్‌- కరోనాపై పోరులో సాయానికి...

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక దాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందున్న భారత్‌పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా దేశీయ వ్యాక్సిన్‌ రూపకల్పనతో ప్రపంచ మానవాళిని కాపాడేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పటికే పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించడమే కాకుండా విదేశాలకు కూడా టీకాను ఎగుమతి చేయడాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

కరోనాపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరుకు భారత్‌ తమ వంతు సాయం చేస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం భారత్‌పై తాజాగా ప్రశంసల జల్లు కురిపించింది. అంతర్జాతీయంగా కరోనాపై జరుగుతున్న పోరులో సాయమందిస్తున్న భారత్‌కూ, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రేసియస్‌ ట్వీట్‌ చేశారు. ఈ పోరులో మనం సహకరించుకుంటేనే, సమాచారం పంచుకుంటేనే ప్రపంచ మానవాళిని కాపాడగలమని ఆయన పేర్కొన్నారు.

WHO Chief Thanks India, PM Modi For Support To Global Covid Response

భారత్‌ ఇప్పటికే స్వదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ నిర్వహిస్తూనే దక్షిణాసియాలోని పొరుగుదేశాలైన మయన్మార్‌, భూటాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో పాటు బ్రెజిల్‌, మొరాకో, దక్షిణాఫ్రికాకు వీటిని ఎగుమతి చేస్తోంది. భారత్‌ అందిస్తున్న సహకారంపై ఇప్పటికే ఆయా దేశాల అధినేతలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తాజాగా బ్రెజిల్‌కు రెండు మిలియన్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ పంపింది. దీనిపై స్పందించిన బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో కరోనాపై పోరులో భారత్‌ వంటి భాగస్వామి దొరకడం సంతోషంగా ఉందన్నారు.

English summary
WHO director general Tedros Adhanom Ghebreyesus tweeted to thank India for continued support in the fight against the pandemic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X