వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Citizenship Act:కేరళ VS కర్ణాటక, మలయాళీ మీడియాకు షాక్, కుట్టీలు అరెస్టు!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/మంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న అల్లర్లను అదుపు చెయ్యడానికి కర్ణాటకలోని మంగళూరు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంగళూరులో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో ఆ వార్తలు సేకరించడానికి కేరళ నుంచి మంగళూరు వచ్చిన సుమారు 50 మంది మలయాళీ పత్రికల రిపోర్టర్లు, కెమెరా మెన్ లను మంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా ప్రతినిధుల కెమెరాలు లాక్కొన్ని తరువాత వారి ఐడీ కార్డులను పరిశీలించిన తరువాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. మంగళూరు పోలీసుల తీరుపై కేరళలో నిరసనలు వ్యక్తం చేసిన మలయాళీలు కర్ణాటక హోం మంత్రి దిష్టిబోమ్మలు దహం చేశారు.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

 ఐడీ కార్డులు ఎక్కడ ?

ఐడీ కార్డులు ఎక్కడ ?

మీడియా గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాత వారిని సొంత పూచికత్తుపై పోలీసులు విడిచిపెట్టారు. కర్ఫూ అమలులో ఉన్న సమయంలో ఎవరు ఎందుకు వస్తున్నారో అర్థంకాక మంగళూరు పోలీసులు సతమతం అవుతున్నారు. ఇప్పటికే స్థానిక మీడియా ప్రతినిధులకు ఐడీ కార్డులు మంజూరు చేసిన పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి మంగళూరు వస్తున్న మీడియా ప్రతినిధుల మీద నిఘా వేశారు.

ఆసుపత్రి ముందు హైడ్రామా !

ఆసుపత్రి ముందు హైడ్రామా !

మంగళూరులో ఆందోళనకారులను అదుపు చెయ్యడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కర్ఫూ అమలులో ఉన్నా రోడ్ల మీదకు వచ్చి పోలీసుల మీద రాళ్లు రువ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరి మృతదేహాలు మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రిలో భద్రపరిచారు. వెన్లాక్ ఆసుపత్రిలోకి మలయాళీ పత్రికల రిపోర్టర్లు ప్రవేశించడానికి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 కర్ణాటక హోం మంత్రి ఫైర్ !

కర్ణాటక హోం మంత్రి ఫైర్ !

కేరళ నుంచి మంగళూరులోకి ప్రవేశించిన కొందరు అల్లర్లు వ్యాపించడానికి కారణం అయ్యారని, అందుకే పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చిందని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే మంగళూరులో గొడవలు జరగడానికి కారణం అయ్యారని, అలాంటి వారి మీద నిఘా వేశామని కర్ణాటక హొం మంత్రి అన్నారు.

 కర్ణాటకపై మండిపడిన మలయాళీలు

కర్ణాటకపై మండిపడిన మలయాళీలు

కేరళ నుంచి అక్కడి ప్రజలు మంగళూరులోకి రావడం వలనే అల్లర్లు జరిగాయని కర్ణాటక హోం మంత్రి చెప్పడంతో కేరళలో మలయాళీలు మండిపడ్డారు. కేరళలోని అనేక ప్రాంతాల్లో కర్ణాటక హోం మంత్రి దిష్టిబోమ్మలు దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి అధారాలు లేకుండా మలయాళీల మీద కర్ణాటక హొం మంత్రి ఎలా నిందలు వేస్తారని కేరళలో ఆందోళనకారులు ప్రశ్నించారు. మంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న మలయాళీ మీడియా ప్రతినిధులను వెంటనే విడిచిపెట్టాలని, స్వాధీనం చేసుకున్న కేమెరాలు వారికి అప్పగించాలని కేరళలో స్థానికులు డిమాండ్ చేశారు.

 చేతకాకపోతే సైలెంట్ గా ఉండాలి !

చేతకాకపోతే సైలెంట్ గా ఉండాలి !

మంగళూరులో అల్లర్లు అదుపు చెయ్యడం చేతకాకపోతే అక్కడి బీజేపీ ప్రభుత్వం సైలెంట్ గా ఉండాలని, మలయాళీల మీద నిందలు మోపి రాజకీయం చెయ్యరాదని మలయాళీలు మండిపడ్డారు. మంగళూరులో జరిగిన అల్లర్లకు మలయాళీలకు ఎలాంటి సంబంధం లేదని, స్థానిక పోలీసుల చేతకానితనం వలనే పరిస్థితి అదుపు తప్పిందని మలయాళీలు ఆరోపించారు.

English summary
Fifty people from Kerala who were came in the name of journalists were arrested by police in Mangaluru this morning.Outsiders indulged in violence says Karnataka Home Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X