వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్య సేతు యాప్ రూపకర్తలు ఎవరు... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన కేంద్రం... ఇలా రూపకల్పన..

|
Google Oneindia TeluguNews

ఆరోగ్య సేతు యాప్‌‌‌ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.యాప్ రూపకల్పనపై తాజాగా ఇచ్చిన వివరణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Recommended Video

Arogya Setu App : ఆరోగ్య సేతు యాప్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
యాప్ రూపకల్పన ఇలా...

యాప్ రూపకల్పన ఇలా...


ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో కేవలం 21 రోజుల వ్యవధిలోనే ఈ యాప్‌ను రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌కు చెందిన అత్యుత్తమ టెక్కీలు,సంస్థలతో కలిసి ఈ మేడిన్ ఇండియా ట్రేసింగ్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇందుకోసం 21 రోజులు నిరంతరం పనిచేసినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆరోగ్య సేతు యాప్‌ లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌లో... పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నామని ప్రభుత్వం వెల్లడించింది. కరోనాపై పోరులో దేశ ప్రజలను ఏకం చేసేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేసింది. యాప్‌ను దాదాపు 16కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని... కోవిడ్ 19పై పోరులో ముందుండి పనిచేసిన ఆరోగ్య కార్యకర్తలకు ఇది దోహదపడిందని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ సైతం ఈ యాప్‌ పాత్రను ప్రశంసించినట్లు తెలిపింది.

సమాచారం ఇవ్వడంలో విఫలం..

సమాచారం ఇవ్వడంలో విఫలం..

ఆరోగ్య సేతు వెబ్ సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ఆరోగ్య సేతుకు రూపకల్పన చేశాయి. అయితే సౌరవ్‌ దాస్‌ అనే సామాజిక కార్యకర్త యాప్ రూపకల్పన వివరాలు కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేయగా... సంబంధిత సమాచారాన్ని ఇవ్వడంలో ఈ రెండు మంత్రిత్వ శాఖలు విఫలమయ్యాయి. దీనిపై సౌరవ్ దాస్ కేంద్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార కమిషన్‌... తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని నోటీసుల్లో పేర్కొంది.

ఎన్ఐఏ నుంచి ఈ గవర్నెన్స్‌కు..

ఎన్ఐఏ నుంచి ఈ గవర్నెన్స్‌కు..

సుమారు రెండు నెలల క్రితం నుంచే సౌరవ్ దాస్ ఆర్టీఐ దరఖాస్తు పలు మంత్రిత్వ శాఖల్లో చక్కర్లు కొడుతోంది. అయినప్పటికీ దానికి సరైన సమాధానం లభించలేదు. యాప్ రూపకల్పనకు సంబంధించిన పూర్తి ఫైల్ తమవద్ద లేదని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIA) బదులిచ్చింది. అక్కడి నుంచి ఫైల్‌ను నేషనల్ ఈ-గవర్నెన్స్ శాఖ వద్దకు పంపించింది. అయితే అది తమ పరిధిలో లేని అంశమని ఈ గవర్నెన్స్ శాఖ స్పష్టం చేసింది. చివరకు ఎలాంటి సమాధానం లేకుండానే దరఖాస్తును తిప్పి పంపించడంతో సౌరవ్ దాస్ కేంద్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

English summary
The Aarogya Setu app was developed in the most transparent manner with public-private collaboration in record time to fight the coronavirus, the government said today, in a detailed clarification after reports that ministries denied any knowledge of who created the app. The names of those associated with the app were already in the public domain, it asserted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X