• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిర్మలా బడ్జెట్‌తో లబ్ధి పొందేది ఎవరు ? నష్టం కలిగేది ఏ రంగాలకు..!!

|

న్యూఢిల్లీ : నిర్మలా పద్దు ప్రకటించేశారు. ఇక కేటాయింపులే ఆసక్తికరంగా మారింది. అన్నిరంగాలను దృష్టిలో ఉంచుకొని కేటాయించారు. ముఖ్యంగా గ్రామీణ భారతానికి పెద్దపీట వేశారు. ఉపాది, రహదారుల కోసం బడ్జెట్‌లో సింహభాగం పద్దు విభజించారు. తొలి బడ్జెట్‌లో ఆమె కేటాయింపులతో ఏయే రంగాలకు ఉపశమనం కలిగించాయి ? ఏయే విభాగాలపై ప్రతీకూల ప్రభావం చూపాయి ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

ప్రతీకూలం, అనుకూలం ..

ప్రతీకూలం, అనుకూలం ..

తొలి పద్దును దాదాపు 2.15 గంటల్లో పూర్తిచేశారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. అంతర్జాతీయ పరిస్థితులను అనుసరించి .. అన్నిరంగాలకు న్యాయం చేస్తూ బడ్జెట్ ప్రకటించారు. ఆర్థిక వృద్ది సాధించడమే లక్ష్యంగా కేటాయింపులు చేశారు. అదేవిధంగా విలాస వస్తువులపై పన్ను పోటు పొడిచారు. అయితే నిర్మలా కేటాయింపులతో ఏయే రంగాలకు లాభం, నష్టం జరిగిందో తెలుసుకుందాం.

బ్యాంకులకు మేలు

బ్యాంకులకు మేలు

నిర్మలా బడ్జెట్‌తో ప్రభుత్వరంగ బ్యాంకులకు మేలు జరగనుంది. వివిధ సంస్థలకు ప్రభుత్వ బ్యాంకులు రూ.700 కోట్ల రుణం అందజేశాయి. రుణం తీసుకొని విదేశాలకు కూడా పారిపోయారు. ఆయా బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు డిఫాల్టర్ లిస్ట్‌లో పెట్టిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర బ్యాంకులు భారీగా రుణం ఇచ్చిన సంగతి తెలిసిందే.

పలెల్లే పట్టుగొమ్మలు

పలెల్లే పట్టుగొమ్మలు

గ్రామీణ భారతంపై నిర్మలా ఫోకస్ చేశారు. ఊర్లలో రహదారులపై దృష్టిసారించారు. రహదారుల నిర్మాణంతో గ్రామాల అనుసంధానం .. విద్యుత్, ఇందనం సరఫరా చేసి చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రాధాన్యమిచ్చారు. దీంతోపాటు ఏవియేషన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దారులు తెరిచారు. అంతేకాదు ఎయిర్ ఇండియా లిమిటెడ్ విమానాలను విక్రయిస్తామని కూడా పేర్కొంది. అంతేకాదు విమానయాన సంస్థ మొత్తానికి ఆర్థిక వనరులు చేకూర్చివారికి లీజుకు ఇచ్చేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంటింటికీ మంచినీరు

ఇంటింటికీ మంచినీరు

2024 నాటికి ఇంటింటికీ మంచినీరు అందజేస్తామని మోడీ సర్కార్ ప్రతీన బూనింది. పైపుల ద్వారా సురక్షిత మంచినీరు అందజేస్తామని వెల్లడించింది. ఇందుకోసం వివిధ కంపెనీలకు కూడా బాధ్యతలు అప్పగించింది. 2050 నాటికి పట్టణ జనాభా ఎక్కవవుతోందని విత్త మంత్రి అంచనా వేశారు. ముంబై లాంటి మహానగరంలో లీజు, అద్దెకు తీసుకునే వారు ఎక్కువవుతారు. 2022 నాటికి దేశంలో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 19.5 మిలియన్లకు చేరుకుంటుందని ఆమె అంచనా వేశారు.

ఇవీ ప్రతీకూలం .. (బంగారం,)

ఇవీ ప్రతీకూలం .. (బంగారం,)

నిర్మలా పద్దుతో లాభపడే విభాగాలు పైవి కాగా .. జువెల్లరీ, బంగారు ఆభరణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే బంగారం ధర పైపైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధర ఆకాశాన్నంటుతుంది. ఈ క్రమంలో బంగారం దిగుమతి పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి వేశారు. దీంతో బంగారం కొనాలంటే సామాన్యుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. దీంతోపాటు రక్షణరంగానికి 3.05 ట్రిలియన్ రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం .. అయితే సైనిక సిబ్బంది కోసం కొనుగోళ్ల చేసే పరికరాలపై మాత్రం ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఎక్కువ, మద్యస్తంగా సంపాదించేవారికి పన్నుపోటు వేశారు. ఆటో స్పేర్స్ పార్ట్స్ కూడా పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. దీంతో ఆటో ఓనర్లపై విడిభాగాల విక్రయం భారం పడబోతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
From raised spending on road building to connect villages, to more rural homes built with power and fuel connections and support for small businesses producing cattle feed, the government’s continued push could benefit companies with exposure to rural India. That includes Godrej Agrovet Ltd., ITC Ltd., Hindustan Unilever Ltd. and Mahindra & Mahindra Ltd., all of whom have interests across the Indian heartland. A gauge of fast-moving consumer products companies rose for a sixth day, the longest streak of gains since March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more