వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిన స్వరం: బీజేపీపై శివసేన నిప్పులు, శరద్ పవార్‌తో సంజయ్ రౌత్ భేటీ..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ తర్వాత.. శివసేన స్వరం కూడా మారింది. శివసేన 170 సీట్లు అని, ఆ పార్టీతో పొత్తు గురించి చర్చించలేదని పవార్ కామెంట్ చేసిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్సీపీ గురించి కాక పరోక్షంగా బీజేపీపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఏం జరిగిందనే అంశం చర్చానీయాంశమైంది.

 బీజేపీపై పైర్

బీజేపీపై పైర్

మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పారిపోయిందని సంజయ్ రౌత్ విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేక చేతులు దులుపేసుకోవడంతోనే.. రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని చెప్పారు. దానికి శివసేన కారణం కాదని తెగేసి చెప్పారు.

పవార్‌పై కాక

పవార్‌పై కాక

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ తర్వాత శివసేన స్వరం మారింది. ఢిల్లీలో పవార్‌తో సంజయ్ రౌత్ సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పినా.. శివసేన పవార్‌తో భేటీ తర్వాత బీజేపీని నిందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏం చర్చించారు..

ఏం చర్చించారు..

పవార్-రౌత్ ఏయే అంశాలపై చర్చ జరిగింది. సీట్లు, ప్రభుత్వ ఏర్పాటుపై పవార్ ఏమన్నారనే అంశం చర్చానీయాంశమైంది. దీంతో శివసేనతో కాంగ్రెస్-ఎన్సీపీ జట్టుకడతాయా లేదా అనే అంశంపై అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఎన్సీసీ-కాంగ్రెస్ ద్వారాలు మూసుకుపోయినట్టేనా అనే చర్చ జరుగుతుంది. లేదంటే శివసేన సీఎం పోస్టుపై కన్నేసి ఉండటంతో.. పవార్ బ్రేకులు వేశారా అనే సందేహాం కలుగుతుంది.

పవార్-సోనియా భేటీ

పవార్-సోనియా భేటీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన పవార్.. కూటమి అంశం గురించి చర్చించలేదని బావిలో రాయి పడేసినంత పనిచేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు గురించి సోనియాగాంధీతో చర్చించలేదని స్పష్టంచేశారు. ఇతరులతో కూడా ప్రభుత్వ ఏర్పాటు గురించి డిస్కస్ చేయలేదన్నారు. మహారాష్ట్రలో ఆయా పార్టీల సంఖ్య, పరిస్థితిపై మాత్రమే సోనియాతో చర్చించానని పవార్ స్పష్టంచేశారు. పవార్ వ్యాఖ్యలతో శివసేన గుండె జారినంత పనైంది. ఇన్నాళ్లు తమతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి.. సోనియాతో సమావేశం తర్వాత మాట మార్చడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

English summary
shiv Sena on Monday made a veiled attack on the BJP, saying those who had the responsibility to form the government in the state ran away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X