బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా కట్టడిలో ప్రపంచంలోనే మోదీ గ్రేట్, బెస్ట్ సీఎం ఎవరంటే?, కేసీఆర్, సర్వేలో షాక్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రపంచంతో పోల్చుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, ప్రపంచ వ్యాప్తంగా పోల్చుకుంటే మన ప్రదాని నరేంద్ర మోదీ చాలా గ్రేట్ అని అందరూ కితాబు ఇస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అరికట్టడంలో ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు గ్రేట్ అంటూ ఓ సర్వే చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సీఎంల జాబితాను ఆ సర్వే విడుదల చేసింది. బెస్ట్ సీఎంతో పాటు సరైన నిర్ణయాలు తీసుకోని చివరి సీఎం పేర్లను ఆ సర్వే విడుదల చేసింది.

క్లబ్ లు, పబ్ లు, బార్ ల్లో లిక్కర్ సేల్స్ కు ఓకే, రూ. 767 కోట్లు లాభం, ఆంధ్రా దెబ్బకు ఆధార్ కార్డుక్లబ్ లు, పబ్ లు, బార్ ల్లో లిక్కర్ సేల్స్ కు ఓకే, రూ. 767 కోట్లు లాభం, ఆంధ్రా దెబ్బకు ఆధార్ కార్డు

ప్రధాని మోదీ సూపర్

ప్రధాని మోదీ సూపర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో 41 లక్షల మంది భాదపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో 2 లక్షల 82 వేల మంది ప్రాణాలు పోయాయి. అమెరికా, యూకే, ఇటలి, స్పెయిన్ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా కట్టడి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కఠిన చర్యలు సూపర్ అంటున్నారు భారతీయులు.

 సరైన టైంలో మోదీ ముందడుగు

సరైన టైంలో మోదీ ముందడుగు

భారతదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలుగా ఆలోచించి లాక్ డౌన్ విధించడంతో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి చక్కటి అవకాశం వచ్చిందని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారని టైమ్స్ నౌ, ఓఆర్ మ్యాక్స్ మీడియా సంయుక్తంగా దేశంలోని ఆరు ప్రముఖ మెట్రో నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వలనే భారత్ లో కరోనా వైరస్ మరణాల సంఖ్యను చాలా వరకు తగ్గించడానికి అవకాశం వచ్చిందని 71 శాతం భారతీయులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.

సీఎంలు ఏం చేస్తున్నారంటే ?

సీఎంలు ఏం చేస్తున్నారంటే ?

దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరెవరు కరోనా వైరస్ కట్టడి కోసం శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారని సర్వే జరిగింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా నగరాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో సర్వే జరిగింది. ఈ సర్వేలో 71 శాతం మంది ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారని టైమ్స్ నౌ, ఓఆర్ మ్యాక్స్ మీడియా సర్వే తెలిపింది.

 ఢిల్లీ సీఎం నెంబర్ వన్

ఢిల్లీ సీఎం నెంబర్ వన్

కరోనా వైరస్ కట్టడి విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని ఢిల్లీ ప్రజలను అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాపాడుతున్నారని 65 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కరోనా వైరస్ కట్టడి కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని ప్రజలు చెప్పారని సర్వే వెల్లడించింది.

 యూడియూరప్ప జంటిల్ మెన్

యూడియూరప్ప జంటిల్ మెన్

కరోనా వైరస్ కట్టడి కోసం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. ఐటీ బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాపించకుండా సీఎం బీఎస్. యడియూరప్ప చాల ప్రయత్నాలు చేస్తున్నారని 56 శాతం మంది వారి అభిప్రాయాలు తెలిపారని సర్వే తెలిపింది.

 తెలంగాణ సీఎం కేసీఆర్ టీం సూపర్

తెలంగాణ సీఎం కేసీఆర్ టీం సూపర్

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణలో కరోనా వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు అందరూ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారని 49 శాతం మంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారని టైమ్స్ నౌ, ఓఆర్ మ్యాక్స్ మీడియా సర్వేలో వెలుగు చూసింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడో స్థానంలో నిలిచారు.

 పళనిస్వామి పర్వాలేదు !

పళనిస్వామి పర్వాలేదు !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని 40 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా పళనిస్వామి నాలుగో బెస్ట్ సీఎంగా నిలిచారు. ఇక దేశంలో కరోనా వైరస్ కేసుల్లో, మరణాల్లో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర (ముంబై)లో కూడా సర్వే జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్కే కూడా ఏదోఒక విధంగా పని చేస్తున్నారని 35 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చెయ్యడంతో ఐదవ బెస్ట్ సీఎంగా నిలిచారు.

Recommended Video

Indian Railways To Resume Passenger Train Services From May 12
అయ్యో మేడమ్ దీదీ, పాపం !

అయ్యో మేడమ్ దీదీ, పాపం !

ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా కట్టడి కోసం చాలా తక్కువగా శ్రమిస్తున్నారని, ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని కేవలం 6 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని, బెస్ట్ సీఎంల జాబితాలో దీదీ చివరికి స్థానంలో ఉన్నారని టైమ్స్ నౌ, ఓఆర్ మ్యాక్స్ మీడియా సర్వే తెలిపింది.

English summary
Lockdown: Who Is Best In Handling Coronavirus: Times Now And ORMAX Survey conducted in six Indian metro citys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X