• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జేపీ నడ్డా ఎవరు? ఆయన ప్రొఫెసరా? -జవాబు చెప్పాల్సింది దేశానికి: చైనా ఆక్రమణలపై రాహుల్ గుస్సా

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలను మరింత రెట్టిస్తూ మన భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించిన వ్యవహారంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చైనా ఆక్రమణలను అడ్డుకోవడంలో మోదీ సర్కారు విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించగా, ఆయనకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సవాళ్లు విసిరారు. అందుకు ప్రతిగా.. అసలు నడ్డా ఎవరు? ఎవరైనాసరే జవాబుదారీగా ఉండాల్సింది దేశానికి కదా? అని రాహుల్ ఫైరయ్యారు..

JP Nadda Convoy దాడి: 'Planned' Mamata Banerjee Mocks BJP Chief ఘటనపై విచారణకు అమిత్ షా ఆర్డర్ !

షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టుషాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టు

 భారత భూభాగంలో చైనా గ్రామం..

భారత భూభాగంలో చైనా గ్రామం..


ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తూ.. అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్ సిరి జిల్లాలో వివాదాస్పద ప్రాంతంలో చైనా కొత్తగా ఒక గ్రామాన్ని నిర్మించిందని, అరుణాచల్‌ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైందని, చైనా బలగాలు ఏకంగా 101 ఇళ్లతో కొత్త గ్రామాన్ని నిర్మించాయని డిఫెన్స్ నిపుణుల సహకారంతో 'ఎన్డీటీవీ' సోమవారం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ..

మోదీజీ.. మీ వాగ్ధానం గుర్తుందా?

మోదీజీ.. మీ వాగ్ధానం గుర్తుందా?

కొద్ది నెలల కిందట తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చైనా బలగాల చేతిలో 20 మంది భారత జవాన్లు హత్యకు గురైన తర్వాత లదాక్ సందర్భనకు వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని ఇంచు కూడా ఎవరూ ఆక్రమించలేదని, దేశాన్ని ఎవరి ముందూ తలవంచనీయనని పేర్కొన్నారు. ఆ విషయాన్ని రాహుల్ గుర్తుచేస్తూ.. నేరుగా మోదీ పేరును ప్రస్తావించకుండానే... మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోండని రాహుల్ ఎద్దేవా చేశఆరు. భారత భూభాగంలో చైనా నిర్మించిన గ్రామానికి చెందిన స్క్రీన్‌షాట్లను కూడా రాహుల్ జోడించారు. మంగళవారం మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో రైతుల నిరసనలపై కాంగ్రెస్ రూపొందించిన 'ఖేతీ కా ఖూన్' బుక్ లెట్ విడుదల సందర్భంలోనూ చైనా అంశంపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

చైనా నిర్మాణాలు సహజమేనన్న బీజేపీ

చైనా నిర్మాణాలు సహజమేనన్న బీజేపీ

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఆక్రమణలపై రాహుల్ చేసిన విమర్శలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మెక్‌మోహన్ రేఖ వెంబడి భారత భూభాగంలో చైనా గ్రామం నిర్మించడం కొత్త పరిణామమేమీ కాదని పేర్కొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్‌ను టార్గెట్ చేస్తూ.. ''నెలవారీ సెలవులు ముగియడంతో రాహుల్ గాంధీ వెనక్కు వచ్చారు.. ఆయన, వారి రాజవంశం, కాంగ్రెస్.. చైనాపై అబద్దాలాడటం ఎప్పుడు ఆగిపోతుంది? ఆయన ప్రస్తావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌ సహా వేలాది కిలోమీటర్లు చైనీయులకు పండిట్ నెహ్రూ తప్ప మరెవరూ బహుమతిగా ఇవ్వలేదని ఆయన ఖండించగలరా? పదే పదే చైనాకు కాంగ్రెస్ ఎందుకు లొంగిపోతుంది?'' అని నడ్డా ట్వీట్లు చేశారు. వీటిపై మీడియా రాహుల్ ను ప్రశ్నించగా..

నడ్డా ఎవరు? ఆయన టీచరా?

నడ్డా ఎవరు? ఆయన టీచరా?

''చైనా ఆక్రమణలపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నేను ప్రశ్నించాను. మధ్యలో ఈ జేపీ నడ్డా ఎవరు? ఆయన సవాళ్లకు నేనెందుకు సమాధానం చెప్పాలి? ఆయనేమైనా నా టీచరా? నేను దేశానికి మాత్రమే సమాధానం చెబుతా'' అని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. చైనా ఆక్రమణల విషయంలో మోదీ సర్కార్ ప్రజలకు అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నేత మండిపడ్డారు. కాగా..

చైనా ఆక్రమణలు కొత్తేమీ కాదు..

చైనా ఆక్రమణలు కొత్తేమీ కాదు..

అరుణాచల్ బీజేపీ ఎంపీ తాపిర్ గవో మాట్లాడుతూ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని వెనక్కి పంపించేందుకు భారత ఆర్మీ ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టకుండా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీనే ఆపినట్టు ఆరోపించారు. 80వ దశకంలోనే చైనా రోడ్డు నిర్మాణం జరిపిందని, లాంగ్జూ నుంచి మజా రోడ్డు నిర్మించి కూడా రాజీవ్ హయాంలోనేని, తవాంగ్‌లోని ఒక వ్యాలీని ఆక్రమించుకుందని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు విధానంలో వెళ్లిందని, కనీసం సరిహద్దుకు రోడ్డు కూడా నిర్మించలేకపోయిందని అన్నారు. కొత్త గ్రామాల నిర్మాణం కొత్తేమీ కాదని, ఇదంతా కాంగ్రెస్ చలవేనని బీజేపీ ఎంపీ అన్నారు.

మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్

English summary
Congress leader Rahul Gandhi on Tuesday took a swipe at Prime Minister Narendra Modi over a report that China has built a village in a disputed region of Arunachal Pradesh. "Who Is JP Nadda?" Rahul Hits Back After BJP Chief's Questions. Nadda had hit out at Rahul over a range of subjects, from China to the coronavirus crisis and the farmer protests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X