వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ్‌దీప్ కాళ్ల మధ్య నుంచి రక్తస్రావం.. జైల్లో చిత్రహింసలు.. ఎవరీ అమ్మాయి... దేశమంతా ఎందుకు చర్చిస్తోంది...

|
Google Oneindia TeluguNews

నవ్‌దీప్ కౌర్... ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమెను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జైల్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ నవ్‌దీప్ కౌర్‌పై చేసిన పోస్టు తర్వాత ఒక్కసారిగా అందరిలోనూ అటెన్షన్ క్రియేట్ అయింది. ఇంతకీ ఎవరీ నవ్‌దీప్ కౌర్... ఆమె ఎందుకు జైలుకు వెళ్లారు...

ఎవరీ అమ్మాయి...

ఎవరీ అమ్మాయి...


నవ్‌దీప్‌ కౌర్‌(23) పంజాబ్‌లోని దళిత సామాజిక వర్గమైన 'మఝబీ సిక్కు'ల అమ్మాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నవ్‌దీప్... కొన్నేళ్ల క్రితం నోయిడాలోని ఒక బల్బుల తయారీ ఫ్యాక్టరీలో పనిలో చేరారు. ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో పాటు,కుటుంబ అప్పులను తీర్చేందుకు ఆమె కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో కార్మిక సంఘం మజ్దూర్ అధికార్ సంఘటన్(MAS)లో చేరి కార్మికుల హక్కుల కోసం ఆమె ఉద్యమిస్తున్నారు.

ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన,రైతులకు సంఘీభావం...

ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన,రైతులకు సంఘీభావం...

ఈ నెల 12న నోయిడాలోని కుంద్లి పారిశ్రామిక ప్రాంతంలో తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ ముందు మాస్ ఆధ్వర్యంలో నవ్‌దీప్ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికులకు వేతన చెల్లింపుల విషయంలో యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని,మహిళా కార్మికుల పట్ల అఘాయిత్యాలను ఆమె ప్రశ్నించారు. అంతకు కొద్దిరోజుల ముందే హర్యానా-ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్‌ వద్ద రైతుల నిరసనకు ఆమె సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా సింఘులో ఆమె ప్రసంగాలు కూడా ఇచ్చారు.

28 రోజులుగా జైల్లో...

ఫ్యాక్టరీ ముందు నవ్‌దీప్ కౌర్ చేపట్టిన నిరసన ప్రదర్శనపై యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆమెపై హత్యాయత్నం,దోపిడీతో పలు నేర అభియోగాలు మోపి అరెస్టు చేశారు. ఈ నెల 12న అరెస్టయిన ఆమెను రిమాండ్ ఖైదీగా కర్నాల్ జైలుకు తరలించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ దాదాపు 28రోజులుగా ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఇప్పటికే రెండు,మూడు సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు కొట్టివేసింది. అయితే జైల్లో నవ్‌దీప్ కౌర్‌ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాళ్ల మధ్య నుంచి రక్తస్రావం...

ఇటీవల నవ్‌దీప్ కౌర్‌ను జైల్లో కలుసుకున్న ఆమె సోదరి రాజ్ వీర్ కౌర్ ఆమె పరిస్థితి గురించి వెల్లడించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాల గుర్తులున్నాయని... పోలీస్ అధికారులు ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఆమె కాళ్ల మధ్య నుంచి రక్తస్రావం కావడాన్ని తోటి ఖైదీలు తమ అమ్మతో చెప్పారని పేర్కొంది. అయితే తమ అక్క ధైర్యవంతురాలని... కడవరకూ పోరాడుతుందని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమెను జైలు నుంచి విడిపించడం కోసం రాజ్ వీర్ కౌర్ తెలిపారు.

మీనా హ్యారిస్ ట్వీట్..


నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం జరుగుతున్న పోరాటంపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ కూడా స్పందించారు. నవ్‌దీప్ కౌర్‌ను జైల్లో పెట్టి లైంగికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అతివాద మూకలు నవ్‌దీప్ కౌర్ ఫోటోను తగలబెడుతున్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మీనా పోస్టుతో సోషల్ మీడియాలో చాలామంది నవ్‌దీప్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. మానవ హక్కుల సంస్థ ఖల్సా కూడా నవ్‌దీప్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వెంటనే జోక్యం చేసుకుని ఆమె విడుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవ్‌దీప్ భద్రతపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ్‌దీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలిచినందుకు,ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ గొంతెత్తినందుకు ఆమెపై ఇంత అరాచకానికి పాల్పడటం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
US Vice President Kamala Harris' niece, Meena Harris' tweet has drawn international attention to the arrest and alleged sexual assault of a young Indian activist and trade unionist who was protesting the unstable wage payment in an industrial cluster near Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X