వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలీదంటున్నకేంద్రమంత్రి ... ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంటే దేశ రాజకీయాల్లోనూ, అలాగే తెలుగురాష్ట్రాలలోనూ తెలియని వారు లేరు. దేశంలోని ఎన్నో పార్టీలు ఇప్పుడు ఆయన రాజకీయ వ్యూహాల కోసం ఆయన వెంట పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక కూడా పీకే రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఎవరో తనకు తెలీదని చెప్పేశారు కేంద్ర మంత్రి .

రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిశోర్ సూచన .. మీరు ఆ ప్రకటన చెయ్యండి ప్రభావం చూడండిరాహుల్ గాంధీకి ప్రశాంత్ కిశోర్ సూచన .. మీరు ఆ ప్రకటన చెయ్యండి ప్రభావం చూడండి

ఢిల్లీలో కేజ్రీవాల్ కోసం పని చేస్తున్న పీకే ఐ ప్యాక్ సంస్థ

ఢిల్లీలో కేజ్రీవాల్ కోసం పని చేస్తున్న పీకే ఐ ప్యాక్ సంస్థ

వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న విషయం తెలిసిందే . ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ పాక్ గురించి, జేడీయూ నేత పీకే ఆమ్ ఆద్మీ పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని చెప్పినప్పుడు కేంద్ర మంత్రి చెప్పినప్పుడు హర్‌దీప్ సింగ్ పూరి పీకే ఎవరో తనకు తెలీదని వ్యాఖ్యలు చేశారు.

 పీకే గురించి తెలీదన్న కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి

పీకే గురించి తెలీదన్న కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి

ప్రశాంత్ కిషోర్ ఎవరు? నాకు అతనెవరో తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పిన ఆయన ఈ పార్టీ లోనుండి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుండి మరో పార్టీలోకి మారే వాళ్ళ గురించి నాకు తెలీదు అన్నారు. ‘ఆయనెవరో మీకు తెలియదా? 2014 ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేశారుగా, గుర్తుకు తెచ్చుకోండి' అని మీడియా ప్రతినిధులు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన సమాధానంగా.. అప్పట్లో తాను బీజేపీలో లేనని, కాబట్టి ఆ విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు. అంతే కాదు పీకే సహకారం వల్ల ఆప్ తో బీజేపీకి నిద్రలేకుండా పోతుందా ఏంటి ? అని వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో విస్తుపోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.

 వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు .. ఆప్ కోసం పీకే వ్యూహాలు

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు .. ఆప్ కోసం పీకే వ్యూహాలు

ప్రశాంత్ కిశోర్ తమ వెంట ఉంటే విజయం ఖాయమని చాలా రాజకీయ పార్టీలు నమ్ముతున్న తరుణంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పీకే కన్సల్టెన్సీ దేశ రాజధానిలో ఆప్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 14 న ప్రకటించారు.2015 ఎన్నికలలో 70 మంది సభ్యులఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాలను కైవసం చేసుకుని కేజ్రీవాల్ తమ పార్టీని చారిత్రాత్మక విజయంతో ముందుకు నడిపించారు. కిషోర్ ఇంతకుముందు 2014 లో మోడీ కోసం పీకే పని చేశారు.

 గతంలోనూ ఎన్నో పార్టీల కోసం పని చేసిన పీకే .. తెలీదని కేంద్ర మంత్రి సంచలనం

గతంలోనూ ఎన్నో పార్టీల కోసం పని చేసిన పీకే .. తెలీదని కేంద్ర మంత్రి సంచలనం

బీజేపీ గెలుపు కోసం ఆయన పనిచేశారు. అనేక వ్యూహాలతో బీజేపీని అందలం ఎక్కించారు. 2015 లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 2017 లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి ఘన విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.అయితే, 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో రాజకీయ వ్యూహకర్త అనుబంధం మాత్రం అక్కడ బెడిసి కొట్టింది. ప్రస్తుతం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆయన పనిచేస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
Union Minister Hardeep Singh Puri on Friday said that he is not aware who is JD-U leader Prashant Kishor when asked about him .. minister said "Who is Prashant Kishor? I don't know him. There is a chap who used to work in UN, then he joined one party, then another party and then another party," Puri said when asked about Kishor being roped in by the Arvind Kejriwal-led AAP and whether the move is giving sleepless nights to BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X