• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రియ వారియర్ కనుసైగలకు ఫిదా, ఎవరీమె? యువత గుండె పిండేస్తున్న వీడియో

|
  Priya Warrior Expression Goes Viral, Star Heros 'Fidaa'

  తిరువనంతపురం: మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ సినిమాలోని హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ!

  సినిమాలో తన ప్రియుడిని చూస్తూ కన్నుకొట్టడంతో పాటు రెండు నిమిషాల పాటు ఉన్న ఆ వీడియోలో ఆమె అందర్నీ మైమరిపింప చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌గా మారింది.

  ఎవరీ ప్రియా ప్రకాశ్ వారియర్

  ఎవరీ ప్రియా ప్రకాశ్ వారియర్

  ప్రియా ప్రకాశ్ వారియర్ వయస్సు 19 ఏళ్లు. ఈమె కేరళలోని త్రిసూర్‌కు చెందిన అమ్మాయి. బీకాం చదువుతోంది. ఆమెకు మోహినియాట్టం క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ వీడియో నేపథ్యంలో ట్విట్టర్ అకౌంటులో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపు నలభై వేలకు చేరుకుంది.

  అల్లు అర్జున్‌కు థ్యాంక్స్

  అల్లు అర్జున్‌కు థ్యాంక్స్

  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోను నేను చూడలేదు.. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది... ఇది నాకు బాగా నచ్చింది అని అల్లు అర్జున్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి ప్రియా వారియర్ థ్యాంక్స్ కూడా చెప్పింది. థ్యాంక్యూ సోమచ్ సర్ అని పేర్కొంది.

  ఇన్‌స్టాగ్రాంలోనూ పెరిగిన ఫాలోవర్లు

  ఇన్‌స్టాగ్రాంలోనూ పెరిగిన ఫాలోవర్లు

  ఇన్‌స్టాగ్రాంలో ఆమెకు ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఆమె ఫాలోవర్ల సంఖ్య పది లక్షలకు పైగా చేరుకుంది. కేవలం ఆదివారమే ఐదు లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఆమె వీడియోకు పెద్ద ఎత్తున లైక్స్ వచ్చాయి. ఒక్క పాటతో ఒక్క రోజులో ప్రియా ప్రకాశ్ వారియర్ స్టార్ అయింది.

  యువత గుండెను పిండేస్తున్న ప్రియ

  యువత గుండెను పిండేస్తున్న ప్రియ

  ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు యువత గుండెను పిండి చేస్తోంది. కుర్రాళ్ల గుండెలను మెలి పెట్టేస్తోంది. ఈ పాటను ఒక్క రోజులో 40 లక్షల మందికి పైగా చూడగా.. అది అంతకంతకు బాగా పెరుగుతోంది.

  ప్రియ కను సైగలకు ఫిదా

  ప్రియ కను సైగలకు ఫిదా

  ప్రియ కనుసైగలకు యూత్ ఫిదా అయిపోయింది. కొన్ని గంటల్లోనే ఆమె సోషల్ మీడియాలోనే కాదు మీడియా స్టార్ కూడా అయిపోయింది. ప్రియను పక్కన పెట్టి చాలామంది అభిమానులు తమ తమ హీరోలతో స్ఫూఫ్‌లు రెడీ చేశారు.

  కంటిబాసతో.. నమ్మలేకపోతున్నా

  కంటిబాసతో.. నమ్మలేకపోతున్నా

  కంటి బాసతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న ప్రియ వారియర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తనకు దక్కిన విశేష ఆదరణపై ఆమె ట్విట్టర్‌లో స్పందించింది. సోషల్ మీడియాలో తనకు ఇంత ఆదరణ రావడం నమ్మలేకపోతున్నానని పేర్కొంది. తనపై అందరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది.

  మాణిక్య మలరాయ పూవీ వీడియో సాంగ్

  మాణిక్య మలరాయ పూవీ వీడియో సాంగ్

  మలయాలంలో ఓరు ఆదర్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియ వారియర్ హీరోయిన్. ఇందులోని మాణిక్య మలరాయ పూవీ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ పాటలోనే ఆమె ముఖ కవళికలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

  English summary
  With Valentine's Day round the corner and theme of love being in the air, a short clip from a Malayalam movie starring Priya Prakash Varrier is doing on various rounds social media platforms.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more