• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవింద్: అవమానం జరిగిన చోటే రాచమర్యాద, ఐఎఎస్ కావాలనుకొని రాష్ట్రపతిగా

By Narsimha
|

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రామ్‌నాద్ కోవింద్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడే ఆయనకు రాష్ట్రపతి హోదాలో రాచమర్యాదలు దక్కనున్నాయి. ఈ నెల 25వ, తేదిన రాష్ట్రపతి పదవి బాధ్యతలను కోవింద్ స్వీకరించనున్నారు. కెఆర్ నారాయణన్ తర్వాత రాష్ట్రపతి పదవిని స్వీకరించిన దళిత నేతగా కోవింద్ రికార్డు సృష్టించాడు.

అనుహ్యంగా రామ్‌నాద్ కోవింద్ పేరు రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించింది ఎన్‌డిఏ. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ పరిశీలకులు భావించారు. ఊహించినట్టుగానే ఈ ఎన్నికల్లో కోవింద్ విజయం సాధించారు.

1997లో కెఆర్ నారాయణన్ ఈ పదవిని దక్కించుకొన్న తొలి రాష్ట్రపతిగా రికార్డుల్లోకెక్కారు. ఆ తర్వాత కోవింద్ ఈ పదవిని దక్కించుకొన్నారు. కోవింద్ పేరును ఎన్‌డిఏ పక్షాలు అనూహ్యంగా తెరమీదికి తెచ్చాయి.

14వ, రాష్ట్రపతిగా కోవింద్ ఈ నెల 25వ, తేదిన బాధ్యతలను స్వీకరించనున్నారు. బీహర్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ఎక్కడైతే కోవింద్ అవమానాలకు గురయ్యారో అక్కడే ఆయనకు రాచమర్యాదలు లభించనున్నాయి.

రైతు కుటుంబం నుండి రాష్ట్రపతి వరకు

రైతు కుటుంబం నుండి రాష్ట్రపతి వరకు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్ూర్ దేహాత్ జిల్లా దేరాపూర్ తాలుకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న ఆయన జన్మించారు. కాన్పూర్ వర్శిటీ నుండి బికాం, ఎల్ఎల్‌బి పట్టా పొందారు. 1971 లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1978-79 మధ్య కాలంలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆయన మూడో ప్రయత్నంలోనే ఆయన ఉత్తీర్ణుడైన ఐఎఎస్ కాలేదు. దీంతో ఆయన న్యాయవాద వృత్తికే పరిమితమయ్యారు. 1977 నుండి కొంతకాలం పాటుజనతాపార్టీకి చెందిన అప్పటి ప్రధానమంత్రి మొరార్జీదేశాయ్‌కు ఆర్థికశాఖకు సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

రాజకీయాల్లోకి

రాజకీయాల్లోకి

సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండిడ్ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్ 1986 లో డిప్రెస్ట్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో జనరల్ సెక్రటరీడా పనిచేశారు. అలిండియా కోలి సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులు 1997 లో చేసిన ఆందోళనలో పాలుపంచుకొన్నారు. యూపిలో రాజ్‌నాద్‌సింగ్‌కు ఆయన సన్నిహితుడు. 1991లో యూపిలోని ఘాటంపూర్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఆయన ఓటమిపాలయ్యారు. 1994, 2006లో బిజెపి తరపున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2007లో తన స్వంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1998-2002లో బిజెపి దళితమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యుడిగా వెళ్ళి ప్రసంగించారు

అవమానం జరిగిందిలా

అవమానం జరిగిందిలా

ఎక్కడైతే తనకు నో ఎంట్రీ అంటూ అవమానం జరిగిందో అక్కడే రాచమర్యాదలు కోవింద్‌కు దక్కనున్నాయి. బీహర్ గవర్నర్‌గా రామ్‌నాద్ కోవింద్ ఈ ఏడాది మే మాసంలో తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ పర్యటనకు వెళ్ళారు. సిమ్లాలో అధికారిక వాహనం వినియోగించారు. సిమ్లాలోని రాష్ట్రపతి భవన్ కూడ సందర్శించాలని భావించారు. కటుంబసభ్యులతో కలిసి భవనం గేటుదాకా వెళ్ళారు. అయితే ముందస్థు అనుమతులు లేకపోవడంతో కుదరదని అక్కడి సిబ్బంది ఆయనను వెనక్కి పంపారు. ఈ బిల్డింగ్‌ను రాష్ట్రపతి విడిదికోసం ఉపయోగిస్తున్నారు. అయితే కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఈ భవనంలోకి కోవింద్‌కు రాచమర్యాదలతో స్వాగతం దక్కనుంది.

ప్రచారానికి దూరమే

ప్రచారానికి దూరమే

బిజెపి జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏ ఛానెల్‌లో కూడ ఆయన సరిగా కన్పించలేదు. పార్టీ, రాజ్‌నాథ్ పట్ల ఉన్న విధేయత కారణంగా 2014 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చాక 2015లో ఆయనను బీహార్ గవర్నర్ గా నియమించారు. రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న, సవితతో పెళ్ళైంది. ప్రశాంత్‌కుమార్, స్వాతి ఆయనకు ఇద్దరు పిల్లలు. మితభాషిగా, సౌమ్యుడిగా రామ్‌నాథ్‌కు పేరుంది.

English summary
Kovind was born on October 1, 1945 at Kanpur Dehat, Uttar Pradesh. He was married to Savita Kovind on 30th May, 1974. Kovind has a son, Prashant Kumar, who is married, and a daughter Swati.Kovind, a B.Com, LLB from Kanpur University (Uttar Pradesh) has been a very successful lawyer. He was Central Government Advocate in Delhi High Court from 1977 to 1979 and Central Government Standing Counsel in Supreme Court from 1980 to 1993, according to his profile on the Bihar governor’s website. Kovind became Advocate-on-Record of the Supreme Court of India in 1978. He had practised in Delhi High Court and Supreme Court for about 16 years until 1993.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X