వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ సరయూ రాయ్, జార్ఖండ్ సీఎంపైనే ఎందుకు పోటీ, కారణాలివేనా..?

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ మాజీ మంత్రి, బీజేపీ బహిష్కృత నేత సరయూ రాయ్‌ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటీ అనే అంశం చర్చకు దారితీసింది. సీఎం రఘుబర్ దాస్‌పై పోటీచేసి సంచలనం సృష్టించడంతో సరయూ రాయ్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. సరయూ రాయ్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ గత ప్రభుత్వంలో మాత్ర క్రమంగా ప్రభ కోల్పోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చేందుక కూడా నిరాకరించింది. దీంతో సీఎం రఘుబర్ దాస్ నియోజకవర్గంలో పోటీకి దిగి గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.

జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లుజార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లు

రానీ టికెట్..

రానీ టికెట్..

రాయ్‌ పశ్చిమ జంషెడ్‌పూర్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. దీంతో తూర్పు జంషెడ్‌పూర్ నుంచి సీఎంపై పోటీకి దిగి సంచలనం సృష్టించారు. ఆయన పోటీకి దిగడంతో బీజేపీ, రఘుబర్ దాస్ కూడా కలవరానికి గురయ్యారు. కానీ ఎవరి అంచనాలను అందుకోలేకపోయారు. సరయూ రాయ్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థలో పనిచేస్తూ.. రాజకీయరంగ ప్రవేశం చేశారు.

1974లో రాజకీయాల్లోకి

1974లో రాజకీయాల్లోకి

1974లో భారతీయ జనతా యువ మోర్చాలో చేరారు. అక్కడినుంచి బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ విభేదాలతో టికెట్ రాలేదు. దీంతో తూర్పు జంషెడ్‌పూర్ నుంచి రఘుబర్ దాస్‌పై పోటీ చేయాల్సి వచ్చింది.

 స్కాం వెలుగులోకి..

స్కాం వెలుగులోకి..

బీహర్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్జేడీ చీప్ లాలు ప్రసాద్ యాదవ్ చేసిన రూ.950 కోట్ల గడ్డి దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చేందుకు కారకుల్లో సరయూ రాయ్ ఒకరు. దాణా కుంభకోణంలో జరిగిన అవకతవకలను బయటకు తీసుకొచ్చారు. దీంతోపాటు మధుకోడా జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన రూ. 4 వేల కోట్ల మైనింగ్ స్కాంను వెలుగులోకి తీసుకురావడంలో కూడా సరయూ రాయ్ పాత్ర ఉంది.

పోరుబాట

పోరుబాట

జార్ఖండ్‌లో రెండు ప్రధాన నదులైన దామోదర్, సుబర్నరేఖ బచావో పేరుతో ఉద్యమం కూడా చేపట్టారు. ఈ నదుల వల్లే జార్ఖండ్ ప్రజల జీవనం ఆధారపడి ఉందని ఎలుగెత్తిచాటారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఉద్యమించారు. ఆసియా ఖండంలో అతిపెద్ద అటవీ సరండాలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ఉద్యమించారు. అక్రమ మైనింగ్ జరగడం వల్లే పర్యావణం దెబ్బతింటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ముందుకుసాగుతున్నారు.

English summary
saryu rai is independent candidate on Jamshedpur-East. before elections he work with cm raghubar das but some clashes party didnot gave ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X