వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ-పన్నీర్ వార్.. కింగ్ మేకర్ ఎవరు? తెర వెనుక రాజకీయం..

పన్నీర్-శశికళ వార్ తో పార్టీలో చీలిక ఏర్పడి.. రాష్ట్రపతి పాలనకు గానీ, ప్రభుత్వ రద్దు వంటి పరిస్థితులకు గానీ దారి తీస్తే.. శశికళ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఆ పరిస్థితికి సిద్దంగా లేరు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రస్తుత తమిళ రాజకీయాల్లో పూర్తి అనిశ్చితి నెలకొంది. ఏ దశలో రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అంచనా వేయలేని పరిస్థితి. తెరపై కనిపిస్తోన్న రాజకీయ తీరు మాత్రం శశికళకు ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.

అయితే ఈ ఎమ్మెల్యేలంతా నిలకడగా శశికళ వెంటే ఉంటారా? అన్నది అనుమానమే. అక్రమాస్తుల కేసులో వచ్చేవారం సుప్రీం కీలక నిర్ణయం వెలువరించనుండటంతో.. అప్పటిదాకా శశికళ వెంట ఉన్న ఎమ్మెల్యేలంతా వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది.

who is the king maker in sasikala and panneer selvam

ఒకవేళ సుప్రీం తీర్పు గనుక శశికళకు ప్రతికూలంగా వెలువడితే.. వీళ్లంతా ఎటు తిరిగి 'పన్నీర్' చెంతకే చేరుతారన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పన్నీర్-శశికళ వార్ తో పార్టీలో చీలిక ఏర్పడి.. రాష్ట్రపతి పాలనకు గానీ, ప్రభుత్వ రద్దు వంటి పరిస్థితులకు గానీ దారి తీస్తే.. శశికళ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఆ పరిస్థితికి సిద్దంగా లేరు.

అలా జరిగితే తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని గనుక చివరాఖరికి వారంతా పన్నీర్ దరి చేరక తప్పదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం తీర్పులో శశికళ దోషిగా తేలినా.. లేదా శిక్షను ఖరారు చేసేందుకు మరికొంత సమయం తీసుకున్నా.. ఆమెకు సీఎం పీఠం దూరమవడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఈ పరిణామాలతోనే గవర్నర్ విద్యాసాగర్ రావు శశికళ ప్రమాణ స్వీకారంపై వెనుకంజ వేసినట్టుగా చెబుతున్నారు. సుప్రీం తీర్పు ఇచ్చేవరకు వేచి చూసి ఆపై నిర్ణయం తీసుకోవాలని అటర్నీ జనరల్ ఆయనకు సలహా ఇచ్చినట్టు సమాచారం.

కాగా, నేటి ఉదయం శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా నిలబడి.. గవర్నర్ పై ఒత్తిడి తీసుకొస్తే.. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గవర్నర్ గనుక ఇందుకు 'నో' చెబితే స్వయంగా ఆయనే రాజ్యాంగ సంక్షోభానికి కారణమైనవారవుతారు కాబట్టి.. ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది కీలకం.

మరోవైపు పన్నీర్ సెల్వంకు అక్కడి ప్రజల మద్దతు పుష్కలంగా ఉంది. సానుభూతి కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. మొత్తం మీద తమిళ రాజకీయ పోకడలను ఇప్పటికిప్పుడు అంచనా వేయడం ఒకింత కష్టంగానే ఉందని చెప్పాలి. వేగంగా మారుతున్న సమీకరణాలు తమిళనాడు రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తాయన్నది వేచి చూడాల్సిందే.

English summary
Tamilnadu politics are creating high tensions in every one. Minute to minute high drama was still continuing on who is the king maker of tamilnadu in between Sasikala and Panneer Selvam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X