వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌కె నగర్ ఫలితాలు: తమిళనాడు రాజకీయాలపై ప్రభావం, ఎవరీ దినకరన్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల ఫలితాలతో మరోసారి టీటీవి దినకరన్ పేరు చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం టీటీవి దినకరన్ గురించి చర్చ సాగుతోంది.తమిళనాడు రాజకీయాలపై ఈ ఫలితం ప్రభావం కన్పించే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అసలు దినకరన్ ఎవరనే విషయాన్ని తెలుసుకొందాం.

దినకరన్ దెబ్బ: ఆర్.‌కె. నగర్‌లో జయలలిత వీడియో కలిసొచ్చిందా?దినకరన్ దెబ్బ: ఆర్.‌కె. నగర్‌లో జయలలిత వీడియో కలిసొచ్చిందా?

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అన్నాడిఎంకెపై కూడ ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరీ దినకరన్, ఇంతకాలం ఎక్కడున్నాడు, కారణమదేనా?ఎవరీ దినకరన్, ఇంతకాలం ఎక్కడున్నాడు, కారణమదేనా?

ఈ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే కొందరు మంత్రులు స్వరం మార్చారు. దినకరన్‌కు మద్దతుగా మాట్లాడడం ప్రారంభించారు.ఈ పరిణామాలను పరిశీలిస్తే తమిళనాడులో మరోసారి రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఎవరీ దినకరన్?

ఎవరీ దినకరన్?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో మరోసారి దినకరన్ పేరు తెరమీదికి వచ్చింది. జయలలిత బతికున్న సమయంలో తన ఇంటి నుండి దినకరన్‌ను బయటకు పంపారనే ప్రచారం సాగుతోంది.శశికళ జైలుకు వెళ్ళే సమయంలో అన్నాడిఎంకె పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను నియమించింది. అయితే శశికళను, దినకరన్‌ను పళనివర్గం పార్టీ నుండి బహిష్కరించింది. పన్నీర్ సెల్వం ఒక్కటిగా నిలిచారు.దినకరన్ శశికళకు మేనల్లుడు. థేని జిల్లాకు చెందిన ఆయనకు భాస్కరన్, సుధాకరన్ అనే ఇద్దరు సోదరులున్నారు.సుధాకరన్‌ను జయలలిత దత్తపుత్రుడిగా స్వీకరించారు.ఆ తర్వాత దూరం పెట్టారు.

దినకరన్‌ను దూరం పెట్టిన జయ

దినకరన్‌ను దూరం పెట్టిన జయ

జయలలిత బతికున్న సమయంలో దినకరన్‌ను దూరం పెట్టారు.పార్టీ వ్యవహరాలు, ప్రభుత్వ వ్యవహరాల్లో దినకరన్ జోక్యం చేసుకొంటున్నట్టు ఆరోపణలు రావడంతో జయలలిత దినకరన్‌ను దూరం పెట్టారని చెబుతుంటారు.గతంలో దినకరన్ అన్నాడిఎంకె తరపున రాజ్యసభ, లోక్‌సభలకు ప్రాతినిథ్యం వహించారు.

దినకరన్‌పై ఈడీ కేసులు

దినకరన్‌పై ఈడీ కేసులు

గతంలో దినకరన్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది. 1991-95 దినకరన్ ఖాతాల్లో భారీగా డబ్బులు డిపాజిట్ చేసినట్టు గుర్తించినత ఈడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. అయితే విదేశీ మారకద్రవ్యం నిబంధనల ఉల్లంఘన కింద ఈ కేసు నమోదైంది.

మరోసారి దినకరన్ చక్రం తిప్పే అవకాశం

మరోసారి దినకరన్ చక్రం తిప్పే అవకాశం

దినకరన్ మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో కన్పించే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అన్నాడిఎంకెపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

English summary
Dinakaran is VK Sasikala’s nephew. He has two brothers — Bhaskaran and Sudhakaran. They are from Theni district. Sudhakaran was Jayalalithaa’s foster son, but she had later disowned him publicly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X