వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుగురు రైతుల మృతి:, ఫోన్లు బంద్, బిజెపి నేతలు ఇలా, అధికారులు అలా

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని మధ్యప్రదేశ్‌లో రైతులు చేస్తున్న ఆందోళన హింసాత్మకమైంది. నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

భోపాల్: వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని మధ్యప్రదేశ్‌లో రైతులు చేస్తున్న ఆందోళన హింసాత్మకమైంది. నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మృతి చెందారు.

సంఘటన చోటు చేసుకున్న మంద్‌సౌర్‌కు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం రానున్నారు. మరోవైపు, మంద్‌సౌర్‌లో సెల్ ఫోన్ సర్వీసులను నిలుపుదల చేశారు.

Who opened firing at protesting farmers in MP? Minister, top official give different versions

రైతులపై కాల్పులు, వారి మృతి విషయంలో బిజెపి, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ వాదనలు వేర్వేరుగా ఉన్నాయి.

శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లోని ఓ మంత్రి మాట్లాడుతూ... ఈ కాల్పుల వెనుక జాతి వ్యతిరేక శక్తుల పాత్ర ఉందని మండిపడ్డారు. మరోవైపు అ ఉన్నతాధికారి మాత్రం.. ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిందని, కాబట్టి పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందన్నారు.

<strong>అన్నదాతపై కన్నెర్ర: తూటాలకు బలైన రైతులు.. మధ్యప్రదేశ్‌లో తీవ్ర హింసాత్మకం..</strong>అన్నదాతపై కన్నెర్ర: తూటాలకు బలైన రైతులు.. మధ్యప్రదేశ్‌లో తీవ్ర హింసాత్మకం..

రైతులపై జరిపిన కాల్పులను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.

అయితే రైతులపై పోలీసులు కాల్పులు జరపలేదని హోమంత్రి భూపేంద్ర సింగ్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనలో సంఘవిద్రోహకర శక్తులు ప్రవేశించాయని, ఈ కాల్పులు వాటిపనేనన్నారు.

మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, అలాగే కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వనున్నట్టు సీఎం శివరాజ్ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.5 లక్షలు, ఉచిత చికిత్ర ప్రకటించారు.

English summary
Who killed the protesting farmers in Madhya Pradesh? The answer is still not clear as everyone is trying to pass the buck to each other. In such a tense atmosphere, the ruling Bharatiya Janata Party and the state administration have come up with different versions to complicate the situation further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X