వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మృతి: ఆ డీఎస్పీ ఎవరు ? 30 గంటలు ఆలస్యం, బాంబు పేల్చేరు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎలా మరణించారు అనే పూర్తి వివరాలు బహిరంగం అయ్యే వరకు తాము పోరాటం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు మనోజ్ పాండియన్ డిమాండ్ చేశారు.

<strong>షాక్: 50 మంది డీఎంకే ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి జంప్ ! రాజేంద్ర బాలాజీ</strong>షాక్: 50 మంది డీఎంకే ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి జంప్ ! రాజేంద్ర బాలాజీ

గురువారం అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు మనోజ్ పాండియన్, తమిళనాడు మాజీ స్పీకర్ పీహెచ్. పాండియన్ శశికళ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. సెప్టెంబర్ 22వ తేది రాత్రి ఒక డీఎస్పీ అపోలో ఆసుపత్రికి ఫోన్ చేసి జయలలితను తీసుకువెళ్లడానికి అంబులెన్స్ పంపించాలని చెప్పారని, ఆ డీఎస్పీ ఎవరో బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంతో ప్రసిద్ది చెందిన అపోలో ఆసుపత్రిలోని ఫిజియోథెరఫీ వైద్యులు జయలలితకు ఎందుకు చికిత్స చెయ్యలేదు, ప్రత్యేకంగా సింగపూర్ నుంచి ఎందుకు వైద్యులను పిలిపించారు అని ప్రశ్నించారు. జయలలిత బుగ్టల మీద నాలుగు గుంతలు ఎలా వచ్చాయి అనే విషయం ప్రజలందరికీ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

Who ordered to take back the Black cats security provided to Jayalalitha, asks Manoj Pandian

<strong>జైల్లో శశికళ స్కెచ్: సీఎంకు సమానంగా అక్క కుమారుడికి కేబినెట్ హోదా!</strong>జైల్లో శశికళ స్కెచ్: సీఎంకు సమానంగా అక్క కుమారుడికి కేబినెట్ హోదా!

అంతే కాకుండ అమ్మ జయలలిత మరణించిన తరువాత 30 గంటల తరువాత ఎందుకు మీడియాకు, ప్రజలకు చెప్పారని ఆరోపించి మనోజ్ పాండియన్, పీహెచ్. పాండియన్ వెంటనే శశికళ, ఆమె బంధువులు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జయలలితకు ఇంత కాలం కట్టుదిట్టమైన భద్రత కల్పించిన జడ్ ప్లస్ భద్రతను ఆమె ఆసుపత్రిలో చేరిన వెంటనే ఎవరు వెనక్కి పంపించారు ? అందుకు కారణాలు ఏమిటి ? అని ప్రజలకు చెప్పాలని అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకులు మనోజ్ పాండియన్, పీహెచ్. పాండియన్ డిమాండ్ చేశారు. ఇదే సందర్బంలో శశికళ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.

English summary
At what time Madam Jayalalitha was taken to Hospital, A DSP called to Apollo for ambulance, who is he? asks P.H.Pandiyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X