వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ మహల్ ఎవరిది?: అసదుద్దీన్ ప్రశ్న, మంత్రి దాటవేత

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాజ్ మహల్ ఎవరికి చెందుతుందని మజ్లీస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం దాటవేసింది. లోకసభ ప్రశ్నోత్తరాల సమయంలో రెండు సార్లు అసదుద్దీన్ ఓవైసీ రెండు సార్లు తాజ్ మహల్‌పై సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మను ప్రశ్నించారు. మ్యూజియాలపై వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సమయంలో అసదుద్దీన్ ఈ ప్రశ్న వేశారు.

సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ మొదటి అనుబంధ ప్రశ్న వేశారు. ఆయన పక్కనే కూర్చున్న ఓవైసీ తాజ్ మహల్ ఎవరికి చెందుతుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. రెండు సార్లు ఓవైసీ ప్రశ్నించినప్పటికీ మంత్రి పట్టించుకోలేదు.

 Who owns Taj Mahal, asks MIM MP Asaduddin Owaisi

తాజ్ మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ ఆజం ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఓవైసీ ఆ ప్రశ్న వేసారు. తాజ్ మహల్ ను వక్ఫ్ ఆస్తిగా పరిగణించాలని, వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఓ పురాతన దేవాలయంలో కొంత భాగాన్ని తీసుకొని తాజ్ మహల్‌ను నిర్మించారని ఉత్తర ప్రదేశ్ బీజేపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ వ్యాఖ్యానించారు. రాజా జై సింగ్ నుంచి తేజో మహాలయ టెంపుల్ లోని కొంత భాగాన్ని మొఘుల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశాడని, అందుకు సాక్ష్యాధారాలున్నాయని అన్నారు. ప్రపంచ వారసత్వ సంపదైన తాజ్ మహల్ పై అజాం ఖాన్ కన్నుపడిందని అన్నారు. తాజ్ మహల్ ఐదు సార్లు నమాజ్ చేసుకునేందుకు అంగీకరించాలన్న అజాం ఖాన్ కోరిక ఎప్పటికీ తీరదని చెప్పారు.

ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదాల్లో కొత్తగా తాజ్ మహల్ చేరనుందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ప్రధాన మంత్రి నేరంద్రమోడీకి 17వ శతాబ్ధానికి చెందిన చారిత్రాత్మక కట్టడమైన తాజ్ మహల్‌ సందర్శనార్ధం సందర్శకులకు ఈ టికెటింగ్ సర్వీసులను ప్రారంభించాలని లెటర్ రాశారు.

English summary
The Centre twice evaded a question asked by MIM president Asaduddin Owaisi in Parliament on Monday. Mr Owaisi, who represents Hyderabad in the Lok Sabha, posed the question to culture minister Mahesh Sharma twice during Question Hour. The minister was responding to supplementary questions on museums.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X