వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బెవరికిచ్చారు?: కేరళ సీఎంను నిలదీసిన సుష్మ

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటర్ల మనసులు దోచుకునేందుకు రాజకీయా పార్టీలు తమ పలు వాగ్ధానాలతోపాటు తమకు అనుకూలించే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రయంత్నంలోనే కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఇరకాటంలో పడ్డారు. చేయని అంశాలను కూడా చేసినట్టు చెప్పిన ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ నిలదీయడంతో ఆయన ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది.

లిబియా నుంచి 29 మంది కేరళీయులను స్వదేశానికి రప్పించేందుకు డబ్బులు చెల్లించామని, ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఆయన ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'చాందీ మీరు ఎవరికి? ఎంత? డబ్బులు ఇచ్చారు' అని ట్విట్టర్ ద్వారా సుష్మా స్వరాజ్ నిలదీశారు. తానైతే ఒక్క పైసా కూడా తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.

విదేశాల్లో ఉన్న భారతీయులను రక్షించడమే తమ కర్తవ్యంగా భారత విదేశాంగశాఖ పని చేస్తుందని ఆమె తెలిపారు. భారతీయులకు ఉన్న ఇబ్బందులు తొలగించడం తమ బాధ్యతగా పని చేస్తున్నాము తప్ప, డబ్బుల కోసం కాదని ఆమె స్పష్టం చేశారు. కాగా, దీనిపై సీఎం ఉమెన్ చాందీ ఇప్పటి వరకు స్పందించలేదు.

English summary
Four days to the Kerala election, a political fight for credit has erupted over the evacuation of 29 Indians from war-torn Libya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X