వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన 'ధారావి'పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు... కరోనా నియంత్రణకు ఆ మురికివాడ ఒక స్పూర్తి..

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన స్టేట్‌మెంట్ కాస్త ఊరట కలిగించేదిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత 6 వారాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయినప్పటికీ... ఇప్పటికీ కరోనా నియంత్రణ సాధ్యమేనని వెల్లడించింది. ఇటలీ,స్పెయిన్,ససససససౌత్ కొరియాతో పాటు భారత్‌లోని 'ధారావి'ని ఇందుకు ఉదాహరణగా చెప్పింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గేబ్రియేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ధారావి గోస ఎంత దుర్భరమంటే... కరోనాపై పోరుకు అక్కడ అదొక్కటే పరిష్కారం..ధారావి గోస ఎంత దుర్భరమంటే... కరోనాపై పోరుకు అక్కడ అదొక్కటే పరిష్కారం..

కిక్కిరిసిన జనసాంద్రతతో ఉండే ముంబైలోని మురికివాడలో వైరస్ వ్యాప్తి విజృంభించినప్పటికీ.. వ్యూహాత్మక చర్యలతో తిరిగి నియంత్రణ సాధించారని టెడ్రోస్‌ అన్నారు. 'టెస్టింగ్,ట్రేసింగ్,ఐసోలేటింగ్&ట్రీటింగ్'తో ఇది సాధ్యమైందన్నారు. ఇటలీ,స్పెయిన్,సౌత్ కొరియా దేశాల్లోనూ ఇదే రకమైన పద్దతిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్లు చెప్పారు. కాబట్టి వైరస్ విజృంభిస్తున్నప్పటికీ... ఇప్పటికీ దాని నియంత్రణ సాధ్యమేనని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు సరైన నాయకత్వం,ప్రజల భాగస్వామ్యం,సామూహిక మద్దతు అవసరం అన్నారు.

WHO praises efforts to contain Covid-19 in Dharavi

వైరస్ నియంత్రణకు ధారావిని ఒక ఉదాహరణగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం చర్చనీయాంశమైంది. కేవలం 2.1 చదరపు కి.మీ పరిధిలో 10లక్షల పైచిలుకు జనాభా ఉండే ఈ ప్రాంతంలో మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) తగిన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది.

Recommended Video

10 Day Lockdown From July 13-23 పూణేలో 10 రోజుల లాక్ డౌన్, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు...!!

కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ధారావిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో యాక్టివ్ కేసులు తగ్గిపోయాయి. గురువారం(జూలై 9) నాటికి ధారావిలో మొత్తం 2347 కేసులు నమోదవగా... అందులో యాక్టివ్ కేసులు 166 మాత్రమే కావడం గమనార్హం.

English summary
The World Health Organisation (WHO) praised the efforts taken to contain the coronavirus in Mumbai’s Dharavi while saying that only aggressive action combined with national unity and global solidarity can turn this pandemic around.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X