వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక తదుపరి సీఎం ఎవరో ? మరోసారి లింగాయత్ కే ఛాన్స్-పరిశీలనలో 8 పేర్లు

|
Google Oneindia TeluguNews

యడియూరప్ప రాజీనామా ప్రకటన నేపథ్యంలో కర్నాటక కొత్త సీఎం ఎవరన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్పతో రాజీనామా చేయిస్తున్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకు సీఎం పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో పలు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

కర్నాటక సీఎంగా రాజీనామా చేసిన యడియూరప్ప ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసి అధికారికంగా పత్రం సమర్పిస్తారు. అనంతరం కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇందులో బీజేపీ అధిష్టానం సూచించిన ఎమ్మెల్యేను మిగతా ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. దీంతో యడియూరప్ప వారసుడి కోసం అధిష్టానం అన్వేషణ సాగిస్తోంది. ఇప్పటికే 8 మందితో ఓ జాబితా తయారు చేసిన అధిష్టానం.. వీరిలో ఒకరిని సీఎంగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Who Will be Next Karnataka CM ? another lingayat mla will be the successor of Yediyurappa

Recommended Video

Karnataka Politics Audio Clip Leaked In Karnataka Increase Heat Over CM Yediyurappa Resign Issue

బీజేపీ అధిష్టానం ప్రాధమికంగా ఎంపిక చేసిన సీఎం పదవి జాబితాలో ధార్వాడ్ వెస్ట్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బెన్నగౌడ పాటిల్ యాత్నాల్, కర్నాటక గనులశాఖ మంత్రి మురుగేష్ ఆర్ నిరానీతో పాటు హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ జాబితాలో ఉన్నారు. ఎలాగో లింగాయత్ వర్గానికే సీఎం పదవి దక్కనుందన్న ఊహాగానాల నేపథ్యంలో పంచమశాలి లింగాయత్ వర్గానికి వీరిలో ఎవరికి అవకాశం ఉంటుందన్న చర్చ సాగుతోంది.

వీరిలో బలమైన ఆరెస్సెస్ నేపథ్యమున్న యాత్నాల్ కు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఆయన కాకుంటే యడ్యూరప్ప మద్దతున్న హోంమంత్రి బొమ్మైకు కూడా అవకాశం దక్కొచ్చు. వీరితో పాటు లింగాయత్ వర్గానికి చెందిని ప్లహ్లాద్ జోషీ, బీఎల్ సంతోష్, అశ్వత్ నారాయణ్, లక్ష్మణ్ సావడి, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరీ, సీటీ రవి వంటి వారు పేర్లను కూడా బీజేపీ అధిష్టానం పరిశీలించవచ్చని తెలుస్తోంది.

English summary
after yediyurappa's resignation annoucement, speculations over whos is the next chief minister of karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X