వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌన్ బనేగా బీజేపీ చీఫ్ : రేసులో ఆ ఇద్దరూ ..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. మోడీ ప్రభుత్వంలో బీజేపీ చీఫ్ అమిత్ షా చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయనకు క్యాబినెట్‌లో కీలక శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. మోడీ, షా ద్వయం ప్రభుత్వంలో ఉంటే పార్టీ పరిస్థితి ఏంటీ అనే చర్చ మొదలైంది. బీజేపీ రథసారథి ఎవరనే అంశంపై ఆ పార్టీలో చర్చకు దారితీసింది.

కీలకం ..
పార్టీకి అధ్యక్ష స్థానం ముఖ్యమైంది. ఇన్నాళ్లూ అమిత్ షా చాణక్యంతో బీజేపీ విజయం సాధిస్తూ వస్తోంది. ఇక షా కూడా క్యాబినెట్‌లోకి వెళ్లడంతో పార్టీని ముందుండి నడిపేవారు ఎవరనే చర్చకు తెరలేపింది. ఆరోగ్య కారనాల వల్ల అరుణ్ జైట్లీ విరామం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన పార్టీ అధ్యక్ష పదవీ రేసులో దాదాపు లేనట్టే. బీజేపీ చీఫ్ పదవీకి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రదాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

who will elect a bjp chief ?

రేసులో వీరే ...
వీరిద్దరూ బీజేపీ అధ్యక్ష పదవీ కోసం పరిశీలిస్తున్నారు. ఇద్దరు బలమైన నేతలు, మంచి వ్యుహంతో ముందుకెళ్లడంతో రథసారథి పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీరిలో ఆరెస్సెస్ ఆశీర్వాదం ఉన్న నేతకు బీజేపీ చీఫ్ పదవీ దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా అధ్యక్ష పదవీ కోసం పరిశీలించే ఛాన్స్ ఉంది. గడ్కరీ ఆరెస్సెస్ వెన్నుదన్ను కూడా ఎక్కువ ఉంది. అయితే గడ్కరీ పగ్గాలు చేపట్టాక .. మోదీ, షా ద్వయం తమ మాట వింటారో .. పెడచెవిన పెడతారోననే భయం ఉంది. అందుకే తమకు విశ్వాసపాత్రులైన నడ్డా, ప్రదాన్ పేర్లను తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

English summary
The NDA government is once again in the center. There is speculation that BJP chief Amit Shah would join the Modi government. He will be promoted to a key role of Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X