• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది... పార్టీల బలాలు బలహీనతలు ఏమిటి..?

|

ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఇక ఈ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంటే ఆయనపై విమర్శలు సంధిస్తున్నాయి విపక్షాలు. ఒకే వర్గానికి చెందిన వారినే మోడీ ప్రోత్సహిస్తున్నారని ఉద్యోగాలు కల్పనలో విఫలమయ్యారంటూ పలు పదునైన విమర్శలే గుప్పిస్తున్నాయి విపక్షాలు. కనీస మద్దతు ధర కల్పించకుండా రైతును కష్టాల ఊబిలోకి నెట్టేశారని విరుచుకుపడుతున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం....

యూపీ అనాలిసిస్: ముక్కోణపు పోటీతో బీజేపీకి అనుకూలంగా మారుతుందా...?

ఎన్డీఏ కూటమి బలాలు బలహీనతలు

ఎన్డీఏ కూటమి బలాలు బలహీనతలు

బలాలు: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అసలైన బలం ప్రధాని నరేంద్ర మోడీ. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనేది కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్‌పై జరిగిన వైమానిక దాడులతో వెల్లడైంది. అంతేకాదు బలమైన నేతగా పేదల పక్షపాతిగా ముద్రవేసుకున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేసే ఎన్నికల ఎత్తుగడలు, రచించే వ్యూహాలు ఎన్డీఏ కూటమికి మరో పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు.

బలహీనతలు:

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించడంలో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా మారుతుంది. అయితే అక్కడ ఎస్పీ-బీఎస్పీలు ఒక్కటవ్వడం కర్నాటకలో కాంగ్రెస్ - జేడీఎస్‌ల పొత్తు బీజేపీకి సవాల్‌గా మారాయి. రైతులు నిరాశకు లోనవడం, ఉద్యోగాలు, జీఎస్టీతో ఇబ్బందులు, మైనార్టీలపై దాడులు, దళితులపై దాడులు ఇవన్నీ బీజేపీ ఫేట్‌ను మార్చే అవకాశం ఉంది. ఇక్కడే బీజేపీ బలహీనంగా కనిపిస్తోంది.

భయాలు: ఇక భారాన్ని మొత్తం ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోడీ భుజస్కంధాలపైనే వేసింది. 2014లో మోడీ మానియాతో ఆయా రాష్ట్రాల్లో విజయఢంకా మోగించిన బీజేపీకి ఈసారి అదే రాష్ట్రాల్లో వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. మరోవైపు బీజేపీ తటస్థ పార్టీలైన బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీలతో పోటీ పడుతోంది.

 కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ బలాలు బలహీనతలు

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ బలాలు బలహీనతలు

బలాలు: 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 44 లోక్‌సభ స్థానాలు మాత్రమే. అయితే ఈసారి కొన్ని సీట్లు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లినా విజయం మాత్రం కాంగ్రెస్‌నే వరించింది.ఈ రాష్ట్రాల్లో మంచి స్థానాలు రాబట్టే అవకాశం కాంగ్రెస్‌కు కనిపిస్తోంది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన విపక్షాలతో కలిసి వెళ్లాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు బలాన్ని చేకూరుస్తోంది

బలహీనతలు: కాంగ్రెస్ ఒకే అంశంపై పదేపదే బీజేపీని టార్గెట్ చేయడం కాస్త ప్రతికూలంగా కనిపిస్తోంది. రాఫెల్, అసహనం, రైతు కష్టాలు, ఉద్యోగాలు తాజాగా పాకిస్తాన్‌పై వైమానిక దాడులు గురించి కూడా ప్రశ్నిస్తుండటం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారుతోంది. అవినీతిపై చేస్తున్న ఆరోపణలు బలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఆరోపణలు అయితే చేస్తోంది కానీ బీజేపీ కూడా కాంగ్రెస్ కుంభకోణాల పై ప్రజలకు గుర్తు చేస్తోంది.

భయాలు: ఈ మధ్యే పాకిస్తాన్‌పై మోడీ వైమానిక దాడులకు ఆదేశించడంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కుదిరిందన్న అంశం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని అయితే రాజకీయాల్లోకి తీసుకురాగలిగింది కానీ ఆమె భర్త రాబర్ట్ వాద్రా పై కేసులు పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత కలిగించేలా లేదు.ఇక యూపీలో ఎస్పీ-బీఎస్పీలు కాంగ్రెస్‌ను పక్కనబెట్టడంతో అక్కడ కాంగ్రెస్ చాలా బలహీనంగా కనిపిస్తోంది

థర్డ్ ఫ్రంట్ బలాలు-బలహీనతలు

థర్డ్ ఫ్రంట్ బలాలు-బలహీనతలు

బలాలు: ఇక కేంద్రంలో నరేంద్ర మోడీకి బీజేపీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఇందులో తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, వైసీపీలు తమ తమ రాష్ట్రాల్లో బలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కంటే బీజేపీకే ఈ పార్టీలన్నీ సవాలు విసురుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 2019లో హంగ్ వస్తే ఈ పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి.

బలహీనతలు: ఇక ఫ్రంట్‌గా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేరు. అంతేకాదు జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ బెంగాల్, ఢిల్లీ, ఒడిషా, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి సరైన సంఖ్యాబలం లేదు.ఈశాన్య భారతంలో లెఫ్ట్ మరియు కాంగ్రెస్ పార్టీలను ప్రజలు తిరస్కరించడంతో అక్కడ బీజేపీ పుంజుకోవడం ఫ్రంట్‌కు మింగుడుపడటం లేదు.

భయాలు: హంగ్ వస్తే ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్న నేపథ్యంలో ఈ పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. అంతేకాదు కామన్ ప్రొగ్రామ్ రూపొందించడం కూడా ఫ్రంట్‌కు కష్టమైపోయింది. మరోవైపు ప్రధాని అభ్యర్థి ఫలానా వ్యక్తి అని చెప్పుకోలేకున్నాయి. ఎవరికి వారే ప్రధాని రేసులో ఉండటంతో థర్డ్ ఫ్రంట్‌లో స్థిరత్వం లోపిస్తోంది. అంతేకాదు ఎస్పీ బీఎస్పీలతో కాంగ్రెస్‌కు పొత్తు కుదరకపోవడం కూడా థర్డ్ ఫ్రంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The 2019 poll battle has begun with the Election Commission announcing a seven-phase poll schedule from April 11 to May 19, culminating in the results on May 23. The big question is who would form the government this time..?While Modi is seeking a second term and pitiching for a majority mandate, his opponents are attacking him for failing on all fronts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more