వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కో దెబ్బకు 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్: క్రికెటర్ గంభీర్

కశ్మీరు ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమని... స్వాతంత్ర్యం కావాలనుకునే వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కశ్మీర్ ముమ్మాటికీ తమదేనని వ్యాఖ్యానించాడు.

కశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగాడు.

స్వాతంత్ర్యం కావాలనుకునే వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్లర్లో గంభీర్ వ్యాఖ్యానించాడు. జాతీయ జెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు.

కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని గంభీర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నాడు. కశ్మీరు ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమని... స్వాతంత్ర్యం కావాలనుకునే వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు.

English summary
New Delhi: A day after a video surfaced showing a Central Reserve Police Force (CRPF) jawan being attacked by an angry mob while he was returning from a polling booth in Srinagar, veteran Indian left-hander Gautam Gambhir slammed the Kashmiri youth for the shocking incident. Gambhir, who doesn't hesitate in sharing his thoughts on burning issues, took to Twitter to slam the Kashmiri youngsters for the heinous incident. "For every slap on my army's Jawan lay down at least a 100 jihadi lives. Whoever wants Azadi LEAVE NOW! Kashmir is ours. #kashmirbelongs2us," he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X