వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిటైలే కాదు..హోల్‌సేల్ ద్రవ్యోల్బణం కూడా అత్యంత భయానకం: పీక్స్‌కు చేరిన.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారిందనడానికి తాజా నిదర్శనం.. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం. రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే ఇది కూడా నేల చూపులు చూస్తోంది. డిసెంబర్ నాటికి అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణంలో చోటు చేసుకున్న పరిణామల ప్రభావం.. దీనిపై పడింది. దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు హోల్‌సేల్ ద్రవ్యోల్బణంపై దుష్ప్రభావాన్ని చూపాయి. జాతీయ గణాంకాల కార్యాలయం మంగళవారం ఈ హోల్‌సేల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్: ఉత్తర తెలంగాణలో ఇంటర్‌నెట్ కట్: భైంసాలో అనుక్షణం..!

 2.59గా నమోదు

2.59గా నమోదు

డిసెంబర్‌లో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 2.59గా నమోదైంది. నవంబర్‌లో నమోదైన గణాంకాలతో పోల్చుకుంటే.. 0.58 శాతం క్షీణించింది. దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.

గత ఏడాదితో పోల్చుకుంటే..

గత ఏడాదితో పోల్చుకుంటే..

2018 డిసెంబర్‌తో పోల్చుకుని చూస్తే.. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఎంతగా దిగజారిందనేది అర్థం చేసుకోవచ్చు. 2018 డిసెంబర్‌‌లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 3.46 శాతం నమోదు కాగా.. సరిగ్గా ఏడాది తిరిగే సరికి ఆ సంఖ్య 2.59కు దిగజారింది. ఆ ఏడాది కాలం పొడవునా ధరల పెరుగుదల కనిపించించింది. నిత్యావసర సరుకులు, కూరగాయల సహా దాదాపు అన్ని రంగాల్లోనూ ధరల పెరుగుదల గణనీయంగా నమోదైందని పేర్కొంటున్నాయి.

రిటైల్ ద్రవ్యోల్బణం కూడా..

రిటైల్ ద్రవ్యోల్బణం కూడా..

ఈ పరిస్థితి ఒక్క హోల్‌సేల్ రంగంలోనే కాదు.. రిటైల్‌లోనూ ఏర్పడిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతంగా నమోదైంది. ఆరేళ్ల తరువాత రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మందగమనం ప్రభావం.. మార్కెట్ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతున్నాయని జాతీయ గణాంకాల సంస్థ విశ్లేషించింది. నవంబర్‌లో 5.54 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణంలో 2.11 శాతం పెరుగుదల కనిపించింది. డిసెంబర్ నాటికి 7.35కి చేరుకుంది.

English summary
Wholesale prices based inflation surged to 2.59% in December, as against 0.58% in November due to increase in prices of food articles like onion and potato. The annual inflation, based on monthly wholesale price index (WPI), was at 3.46% during the same month a year ago (December 2018).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X