వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5జీ టెక్నాలజీ, 40లక్షల ఉద్యోగాలు: కేంద్రమంత్రివర్గ కీలక నిర్ణయాలివే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరకు రైతుల కోసం గత జూన్ మాసంలో రూ.8,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో రూ. 4,500కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

<strong>అవే దేశానికి పట్టిన చీడపరుగులు: కాంగ్రెస్‌పై నరేంద్ర మోడీ నిప్పులు</strong>అవే దేశానికి పట్టిన చీడపరుగులు: కాంగ్రెస్‌పై నరేంద్ర మోడీ నిప్పులు

చక్కెర ఎగుమతి కోసం మిల్లుల రవాణా రాయితీ కింద ఈ ప్యాకేజీని పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

 Whopping 40 lakh fresh jobs by 2022? Here’s what Narendra Modi government is planning

వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశంలో 40లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన కొత్త టెలికాం విధానానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ(ఎన్డీసీపీ)-2018 పేరుతో రూపొందించిన ఈ విధానం ద్వారా 5జీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయాలని లక్ష్యం పెట్టుకుంది.

దేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటు ధరలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఒక సెకనుకు 50మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2020నాటికి దేశంలో 40లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ విధానం కింద స్పెక్ట్రమ్ ధరలను హేతుబద్ధీకరించడం ద్వారా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగాన్ని లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
The Prime Minister Narendra Modi-led Union Cabinet on Wednesday approved a proposal for the creation of 40 lakh new jobs in the country by the year 2022. This was announced following the cabinet meeting by Finance Minister Arun Jaitley along with Law Minister Ravi Shankar Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X