వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5జీ నామ సంవత్సరం 2020.. కానీ స్పీడ్‌తోనే తంటా.. భారీగా హ్యాకింగ్ ముప్పు!

|
Google Oneindia TeluguNews

5జీ నెట్‌వర్క్.. త్వరలో రాబోతోంది. 2019లోనే 5జీ లాంఛ్ చేయాలనుకొన్న సాంకేతిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో 2020కి వాయిదాపడింది. ఇంతకీ 5జీలో నెట్‌వర్క్‌లో ఏముంది? కేవలం స్పీడేనా...? నెట్‌వర్క్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి..? బ్యాంకింగ్ రంగానికి మరింత ఊతమిస్తోందా..? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

 5 జీ క్రేజ్..

5 జీ క్రేజ్..

5జీ, 5జీ, 5జీ... అవును 5జీ నెట్‌వర్క్ కోసం యువత ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్న 4జీ స్పీడ్‌లో పదింతల స్పీడ్ ఉండటమే కారణం. నిమిషంలో సినిమా డౌన్‌లోడ్ అవుతోంది. ఇక ఆన్‌లైన్ ఆటలను ఇష్టపడేవారైతే మొబైల్‌లో మునిగితేలుతారు. పబ్జీ లాంటి ఆటలు ఆడేవారు నెట్ మరింత స్పీడ్ ఉండటంతో లీనమైపోవడం ఖాయం.

ఉపాధి కూడా

ఉపాధి కూడా

5 జీ నెట్‌వర్క్‌తో ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. బ్యాంకింగ్ రంగంలో 2035 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తోందని, దాదాపు 22 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తోందని ‘ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ మార్కెట్ 5జీ ఎకనామిక్ ఇంపాక్ట్ స్టడీ' పేర్కొన్నది. అయితే 5 జీ నెట్‌వర్క్ రావడంతో హ్యాకర్ల నుంచి ముప్పు కూడా ఎక్కువే ఉండనుంది. 4 జీ వాడుతున్న సమయంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. మరీ డేటా స్పీడ్ అయితే అత్యంత వేగంగా డేటా చోరీ చేసే అవకాశం ఉంది.

హై వీడియో క్వాలిటీ

హై వీడియో క్వాలిటీ

5జీ నెట్‌వర్క్‌తో హై క్వాలిటీ వీడియో..బ్రేక్ లేకుండా స్పష్టంగా చూసే వెసులుబాటు ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ముందు ఉండే దక్షిణకొరియా ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌ను పరిశీలించి చూసింది. ప్రాథమిక దశలో 4జీ కన్నా మూడురేట్ల వేంగా ఉన్నట్టు గుర్తించారని ఎరిక్‌సన్ మొబిలిటీ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. అంతేకాదు ఏఆర్, వీఆర్‌లో వీక్షకులు లీనమవుతారని తెలిపింది.

హై వీడియో క్వాలిటీ

హై వీడియో క్వాలిటీ


5జీ నెట్‌వర్క్‌తో హై క్వాలిటీ వీడియో..బ్రేక్ లేకుండా స్పష్టంగా చూసే వెసులుబాటు ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ముందు ఉండే దక్షిణకొరియా ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌ను పరిశీలించి చూసింది. ప్రాథమిక దశలో 4జీ కన్నా మూడురేట్ల వేంగా ఉన్నట్టు గుర్తించారని ఎరిక్‌సన్ మొబిలిటీ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. అంతేకాదు ఏఆర్, వీఆర్‌లో వీక్షకులు లీనమవుతారని తెలిపింది.

న్యూ లుక్

న్యూ లుక్

ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో రోజుకో ఏదో ఒక మార్పుతో వస్తువులు వస్తూనే ఉంటాయి. ఇక మొబైల్స్ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే కర్వ్, కాప్చర్ మోడల్స్ మార్కెట్లో వస్తోన్నాయి. 5 జీ నెట్ వర్క్ వస్తోన్న నేపథ్యంలో మొబైల్స్ కూడా అదే స్థాయిలో కొత్త లుక్, స్పెషిపికేషన్స్‌తో కంపెనీలు రూపొందిస్తున్నాయి. మరోవైపు 5 జీ ఫోన్లలో ప్రత్యేకంగా రేడియో ఫీచర్ కూడా రూపొందించాలని ఆయా మొబైల్ కంపెనీలు తెలుపడం విశేషం.

సెబర్ థ్రెట్

సెబర్ థ్రెట్

5జీ నెట్‌వర్క్‌తో సెబర్ కేటుగాళ్ల నుంచి ముప్పు ఉంది. 4 జీ స్పీడ్ ఉన్నప్పుడే వారు రెచ్చపోయారు. 5 జీ స్పీడ్‌తో వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం కానీ, సైబర్ కేటుగాళ్లు నగదును ఈజీగా, క్షణాల్లోనే కొల్లగొట్టే అవకాశం ఉంది. అంతేకాదు కార్పొరేట్ కంపెనీలు పనిచేసే ఉద్యోగులు కూడా తమ డాటాను వేగంగా ఇతరులకు షేర్ చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఆయా చోట్ల వీక్షణ, నియంత్రించేలా డేటాను సవరించాలని ఆయా సంస్థలకు ఫోర్స్ పాయింట్ సూచించింది. దీంతో సైబర్ నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. 5 జీ మొబైల్ నెట్‌వర్క్స్ ఆదాయం మరింత పెచుంతుందని జూనిపర్ రీసెర్చ్ సంస్థ పేర్కొన్నది.

నవశకమే..

నవశకమే..

5 జీ నెట్‌వర్క్‌తో బ్యాంకింగ్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ' పేర్కొన్నది. ఆన్‌లైన్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏటీఎంల వద్ద జనాలు గుమిగూడే అవకాశం ఉండదని, అన్నీ ఆన్‌లైన్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నది.

9.5 మిలియన్ల మొబైల్స్

9.5 మిలియన్ల మొబైల్స్

2019లో 5 జీ నెట్‌వర్క్ వస్తోందన్న ఊహాగానాలతో 9.5 మిలియన్ స్మార్ట్ ఫోన్లను కంపెనీలు ఉత్పత్తి చేశాయి. 2020 మార్చి-ఏప్రిల్‌లో బిడ్ దాఖలు చేయనుండటంతో... జూన్ వరకు 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. అప్పటికీ 5 జీ మొబైళ్ల కొనుగోలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో క్వాల్‌కామ్ తన మొబైల్స్ ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తోన్నాయి. 4 జీ ఫోన్ల ఉత్పత్తిని తగ్గిస్తూ.. 5 జీ ఫోన్ల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. 4 జీ ఫోన్లకు క్రేజ్ తగ్గుతున్నందున పది 5 జీ ఫోన్లను 2020లో ఉత్పత్తి చేస్తున్నామని షియోమీ సీఈవో లీ జూన్ ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌'లో చెప్పారు.

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

ప్రపంచవ్యాప్తంగా 5 జీ బ్యాండ్ ఆమోదిస్తున్నట్టు 2019 ఏడాది తొలినాళ్లలో ‘ప్రపంచ టెలికాం సంస్థ' పేర్కొన్నది. 24.25 నుంచి 27.5 జీహెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీలో నడుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోని 5 జీ నెట్‌వర్క్ కోసం బిడ్లను 2020 మార్చి-ఏప్రిల్‌లో నిర్వహిస్తామని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో తెలిపారు. బిడ్లు రూ.1.47 లక్షల కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

English summary
5g network bid in india march-april 2020, central telecom minister ravishankar prasad said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X