వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం: బుందేల్ ఖండ్ నుండే అఖిలేష్ ఎందుకు పోటీచేయాలనుకొంటున్నాడు?

ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకుగాను బుందేల్ ఖండ్ నుండి పోటీచేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రయత్నాలను ప్రారంభించాడు. రాజకీయంగా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసేందుకు ఎస్ పి .

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుందేల్ ఖండ్ నుండి పోటీచేయనున్నారు. ఈ ప్రాంతంలోని రెండు అసెంబ్లీ స్థానాల నుండి అఖిలేష్ పోటీచేస్తారని పార్టీ వర్గాలుచెబుతున్నాయి. బుందేల్ ఖండ్ లో ప్రత్యర్థుల ఆధిపత్యాన్ని దెబ్బతీయడంతో పాటు తమ పార్టీ విజయావకాశాలను మెరుగుపర్చుకొనేందుకు అఖిలేష్ ఈ వ్యూహన్ని అనుసరిస్తున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతం కూడ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాంతం నుండి తాను ప్రాతినిథ్యం వహించడం ద్వారా ఈ ప్రాంతంలో డెవలప్ మెంట్ జరుగుతోందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేందుకు అఖిలేష్ కృషిచేస్తున్నాడు.

బుందేల్ ఖండ్ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొనసాగుతోంది.ఈ ప్రాంతం చాలా వెనుకబడింది.అయితే ఈ ప్రాంతంలో బిఎస్ పి ఆధిపత్యం కొనసాగుతోంది.అయితే ఈ ఆధిపత్యానికి తెరదించేందుకుగాను అఖిలేష్ వ్యూహరచన చేస్తున్నాడు.

ఈ ఎన్నికల్లో బుందేల్ ఖండ్ నుండి పోటీచేసేందుకు అఖిలేష్ అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. అయితే ఈ ప్రాంతంలోని రెండు అసెంబ్లీ స్థానాల నుండి ఆయన పోటీచేసేందుకు సిద్దమయ్యారు.

బుందేల్ ఖండ్ నే అఖిలేష్ ఎందుకు ఎంచుకొన్నారు

బుందేల్ ఖండ్ నే అఖిలేష్ ఎందుకు ఎంచుకొన్నారు

గత ఏడాది చివర్లో బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలోనే ములాయంసింగ్ యాదవ్ , శివపాల్ యాదవ్ 375 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో విస్తృతంగా అఖిలేష్ పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది.అయితే అఖిలేష్ అధికారంలోకి వచ్చాక బుందేల్ ఖండ్ ప్రాంతంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టారు. పలు ఉచిత పధకాలను రాష్ట్రంలో చేపట్టాడు అఖిలేష్ యాదవ్. ఈ కార్యక్రమాలు తమ పార్టీకి కలిసివస్తాయనే అభిప్రాయంతో అఖిలేష్ యాదవ్ ఉన్నారు.

అభివృద్ది, సంక్షేమపథకాలు గట్టెక్కిస్తాయా ?

అభివృద్ది, సంక్షేమపథకాలు గట్టెక్కిస్తాయా ?

బుందేల్ ఖండ్ ప్రాంతంలో అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ ప్రాంతంలో తాము పట్టును పెంచుకొనే ఉద్దేశ్యంతోనే అఖిలేష్ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జాతీయ ఉపాధి హమీ పధకం, ఆహర భద్రతా పథకం, మధ్యాహ్నభోజన పథకాలను పథకాలను సమర్థవంతంగా అమలు చేశారు. మరో వైపు సామాజిక భద్రతా పించన్లు మంజూరు చేస్తానని ఆయన హమీలు గుప్పిస్తున్నారు.ఈ ప్రాంతం నుండి తాను పోటీ చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని 19 అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడ దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని అఖిలేష్ భావిస్తున్నారు. ఇది తమ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.అందుకే బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని ఆయన ఎంచుకొన్నాడు.

జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకే బుందేల్ ఖండ్ ఎంచుకొన్నాడా?

జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకే బుందేల్ ఖండ్ ఎంచుకొన్నాడా?

బుందేల్ ఖండ్ ప్రాంతం వెనుకబడి ఉంది. ఈ ప్రాంతవాసుల ఆందోళనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. బుందేల్ ఖండ్ పై పట్టుసాధిస్తే రాజకీయంగా తనకు భవిష్యత్ లో ఉపయోగపడే అవకాశం ఉందని అఖిలేష్ అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు ఆయన బుందేల్ ఖండ్ ను ఎంచుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.సాంస్కృతిక పరంగా చారిత్రకంగా కూడ ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఉంది.ఈ ప్రాంతం నుండి విజయం సాధించి వాటిని అభివృద్ది చేస్తే రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

క్లీన్ ఇమేజ్ అఖిలేష్ కు కలిసి రానుందా?

క్లీన్ ఇమేజ్ అఖిలేష్ కు కలిసి రానుందా?

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం చేపట్టిన అఖిలేష్ కు క్లీన్ ఇమేజ్ ఉంది. అవినీతి ఆరోపణలు రాలేదు.అయితే వెనుకబడి న బుందేల్ ఖండ్ వాసులు అఖిలేష్ మాటలను విశ్వసించేందుకు ఇవి దోహదపడే అవకాశం ఉంది.మరో వైపు అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ది మంత్రం పాటించాడు. డెవలప్ మెంట్ వైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాడు. అఖిలేష్ లాంటి నాయకుడు తమ ప్రాంతానికి వస్తే తమ ప్రాంతం అభివృద్ది చెందే అవకాశం ఉందని స్థానికులు భావించే అవకాశం లేకపోలేదు. ఈ మేరకు బుందేల్ ఖండ్ వాసులు ఎస్ పి వైపుకు మొగ్గుచూపేందుకు అవకాశాలు కూడ ఎక్కువగానే ఉన్నాయని రాజకీయవిశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

బలాన్ని పెంచుకొనేందుకు బుందేల్ ఖండ్ నుండి పోటీ

బలాన్ని పెంచుకొనేందుకు బుందేల్ ఖండ్ నుండి పోటీ

సమాజ్ వాదీ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకొనేందుకుగాను బుందేల్ ఖండ్ నుండి అఖిలేష్ రంగంలోకి దిగనున్నారు ఎటావా, కనౌజ్, మైపూరి ,ఫరూఖాబాద్ స్థానాల్లో ఎస్ పి కి గట్టిపట్టుంది. దీనికి బుందేల్ ఖండ్ లో కూడ అదనపు బలం తోడైతే పార్టీ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయని ఎస్ పి అంచనావేస్తోంది. గత ఎన్నికల్లో బుందేల్ ఖండ్ లో 7 స్థానాల్లో బిఎస్ పి, ఐదు స్థానాల్లో ఎస్ పి, కాంగ్రెస్ 4 స్థానాల్లో, బిజెపి మూడు స్థానాల్లో విజయం సాధించింది. బాబినా , మహౌబా అసెంబ్లీ స్థానాల నుండి అఖిలేష్ పోటీచేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

English summary
why akhilesh wants to contest from bundelkhand, he is plan to upper hand opposite parties in bundelkhand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X