వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుపమ్ ఖేర్ మేధావిగా విఫలమయ్యారా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు వివాదాల మధ్య ఎఫ్‌టిఐఐ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన గజేంద్ర చౌహాన్‌కు అంతకుముందుగానే మద్దతుగా నిలిచారు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఆ పదవిని చౌహాన్ చేపట్టకపోవద్దనడానికి ఏవైనా కారణాలున్నాయా? అని ప్రశ్నించారు. ఎందుకు పదవిని చేపట్టకూడదని నిలదీశారు.

భారతదేశంలో అసహనం ఉందంటూ పలువురు పేర్కొనడంతో అనుపమ్ ఖేర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనం ఉందంటూ కొందరు ర్యాలీలు తీస్తే.. వారికి వ్యతిరేకంగా అనుపమ్ ఖేర్ కూడా భారీ ర్యాలీని చేశారు. అప్పటి నుంచి ఆయన దేశం కోసం ఆందోళన చేసే వ్యక్తిగా మారిపోయారు. కానీ, 2016లో మాత్రం తన మద్దతుదారులను నిరాశపరిచేలా తయారైనట్లు తెలుస్తోంది.

ఖేర్ తగ్గుదల: తొలిసారి పద్మపై యూ టర్న్, తర్వాత పాక్ వీసాపై అభాసుపాలు

పద్మ అవార్డులపై మొదట యూటర్న్ ఇలా.. ఈ ఏడాది పద్మ భూషణ్ అవార్డు అందుకున్న అనుపమ్ ఖేర్.. 2010లో ఈ అవార్డులకు క్రిడిబిలిటి లేదని అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పించారు. బిజెపికి అనుకూలంగా ఉన్నందువల్లే ఆయనకు ఈ అవార్డు వరించిందని ఆరోపించారు.

Why Anupam Kher’s mission to become a right-wing intellectual sank without a trace

అసహనం వ్యక్తం చేస్తున్న వారికి వ్యతిరేకంగా అనుపమ్ ఖేర్ గత నవంబర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. దీనికి అవార్డు కంటే పెద్ద బహుమతి ఖేర్‌కి లభిస్తుందా? అని ప్రశ్నించారు.

ఆ తర్వాత ఈ నటుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కరాచీలో ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరుకానున్న ఖేర్.. పాకిస్థాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తు చేయని కారణంగా పాకిస్థాన్ అధికారులు అనుపమ్ ఖేర్‌కి వీసా నిరాకరించారు.

ఆ తర్వాత పాకిస్థాన్ హై కమిషనర్ తమ నుంచి వీసా ఇస్తామని ప్రకటించారు. అయితే తనకు డేట్స్ లేవని వీసాను తిరస్కరించారు అనుపమ్ ఖేర్. ఈ రెండు పరిణామాలు 2016 తొలినాళ్లలోనే అతని ప్రణాళికలేమిని తెలియజేశాయి.

2019లో లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతోనే రాజకీయ పరమైన చర్యలకు పూనుకుంటున్నారని అనుపమ్ పై ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవడం వల్లే ఆయనపై విమర్శలు వస్తున్నట్లు తెలుస్తోంది.

మితవాద మేధావిగా చాటి చెప్పుకోవడం

ఈ 60ఏళ్ల అనుపమ్ తనను తాను మితవాద మేధావిగా చెప్పుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వామపక్షవాదులు మోడీ ప్రభుత్వం హయాంలో అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తుండగా వారికి ధీటుగా సమాధానం చెబుతున్నారు ఖేర్.

మితవాద మేధావులకు మన దేశంలో బాగానే గుర్తింపు ఉన్నప్పటికీ.. దానిపైనే నిలబడటం చాలా కష్టమైన పని. ఎందుకంటే భారతదేశంలో రాజకీయాలకతీతంగా ఉదార ప్రభుత్వాలు ఉండాలి. మనదేశంలో వామపక్ష సాంప్రదాయాలకు సానుకూలమైన వాతావరణం ఎక్కువే ఉంది. ఈ ముసుగులో జనాకర్షణ జరుగుతోంది.

భారతదేశానికి ఉదారవాద రాజకీయ తత్త్వాన్ని ప్రయత్నించే సాంప్రదాయం లేదు

భిన్నమైన వర్గాలున్నప్పటికీ భారతదేశం ఒక బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఇందుకు అనేక భావనలు దోహదం చేస్తున్నాయి. భారతదేశం ఏ రాజకీయ తత్వాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల కేంద్ర పాలన లోపం కారణంగా పలు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది.

భాతర రైట్ వింగ్ కల్చర్‌ అనుపమ్ ఖేర్‌కు సమస్య ఎందుకైంది?

అనుపమ్ ఖేర్ ఎక్కడ విఫలమయ్యారు. రాజకీయంగా వీరిని లక్ష్యం చేసుకోవడం పెద్ద పనేం కాదు(సుధీంద్ర కులకర్ణిపై శివసేన ఇంకుపోవడంపై విమర్శలు చేయడం). కానీ, ఈయన పాకిస్థాన్ మాజీ దౌత్యాధికారి పుస్తకాన్ని కులకర్ణి ఎందుకు విడుదల చేయాలని ప్రశ్నిస్తారు.

పాకిస్థాన్‌కు క్రికెటర్లు, కళాకారులు మనదేశంలో అడుపెట్టడాన్ని వ్యతిరేకించే వారికి మద్దతు పలికే అనుపమ్ ఖేర్.. అదే సమయంలో ఇతను పాకిస్థాన్ దేశంలో పర్యటించేందుకు సిద్ధమవుతారు. ఆ తర్వాత తాను వెళ్లనని తేల్చేస్తాడు. దీంతో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చిపడ్డాయి.

ఈ ద్వంద్వ వైఖరే అతనిపై విమర్శలు వచ్చేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ‘కాంగీ చెంచా' అనడం కూడా విమర్శలకు దారితీసింది.

తనకు తానే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు

దేశంలో ప్రముఖ వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్న అనుపమ్ ఖేర్ లాంటి వ్యక్తులు రాజకీయ నాయకులకు అవకాశం ఇస్తే వారి ఆరోపణలు, విమర్శలు తట్టుకోలేరు. వారి క్రెడిబిలిటి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఖేర్‌కు పాకిస్థాన్ వీసా నిరాకరించడం సమంజసమేనని శశిథరూర్, నందితా దాస్‌లు అనడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా చేసి వీరు తమ మితవాద సూడో మేధావితనాన్ని ప్రదర్శించనట్లయింది.

English summary
Some months ago, renowned actor Anupam Kher presented some logical points before Gajandra Chauhan, whose appointment as the FTII head generated much controversy, in a primetime news programme while explaining why the latter should not take up the post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X