చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహస్యంపై రెడీ: 3 గం.ల ముందు బ్లాక్ క్యాట్స్.. జయ మృతిపై ఎన్నో డౌట్స్

దివంగత జయలలిత మృతిపై ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత మరిన్ని అనుమానాలను లేవనెత్తుతున్నారు. జయలలిత మృతి వ్యవహారంలో ఏం జరిగిందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చెప్పారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలిత మృతిపై ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత మరిన్ని అనుమానాలను లేవనెత్తుతున్నారు. జయలలిత మృతి వ్యవహారంలో ఏం జరిగిందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చెప్పారు.

జయ మరణంపై న్యాయ విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా పన్నీర్‌ మద్దతుదారులు బుధవారం నిరాహార దీక్షలు చేశారు. చెన్నైలోని ఎగ్మూర్‌ రాజరత్నం మైదానంలో పన్నీర్‌సెల్వం నిరాహార దీక్ష చేశారు.

<strong>11.30-4.30.. అప్పుడు చనిపోలేదు: జయలలిత మృతిపై పన్నీరుసెల్వం బాంబు </strong>11.30-4.30.. అప్పుడు చనిపోలేదు: జయలలిత మృతిపై పన్నీరుసెల్వం బాంబు

ఇందులో భాగంగా పీహెచ్ పాండియన్, పొన్నియన్ తదితర నేతలు జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పన్నీరు మాట్లాడుతూ.. జయ మరణంపై ఏం జరిగిందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ ధర్మయుద్ధం ఇంతటితో ఆగదని, నిరాహారదీక్ష తొలి అంకం మాత్రమేనన్నారు.

జయలలిత ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఒక్కసారి కూడా చూడటానికి తనను అనుమతించలేదన్నారు. న్యాయ విచారణ కోరినందునే తనపై విచారణ జరపాలని మంత్రి విజయభాస్కర్‌ కోరుతున్నారని, న్యాయ విచారణ జరిగితే వాస్తవాలు తేలుతాయని, ప్రథమ దోషి విజయభాస్కరే అవుతారన్నారు.

బ్లాక్ కమాండోస్ తొలగింపు మర్మమేమిటి?

బ్లాక్ కమాండోస్ తొలగింపు మర్మమేమిటి?

మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గం నేత పీహెచ్ పాండియన్ బుధవారం నాడు ఓ ప్రశ్న లేవనెత్తారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరే సమయంలో ఆమెకు రక్షణగా ఉండే బ్లాక్ కమాండోస్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

మూడు గంటల ముందు

మూడు గంటల ముందు

మాజీ మంత్రి పొన్నియన్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. జయలలితను ఆసుపత్రికి తీసుకు వెళ్లే మూడు గంటల ముందు పోయెస్ గార్డెన్ నుంచి బ్లాక్ క్యాట్స్‌ను తొలగించారని చెప్పారు.

ఆ లేఖతో మరిన్ని అనుమానాలు

ఆ లేఖతో మరిన్ని అనుమానాలు

జయలలిత మృతిపై పన్నీరు వర్గం, విపక్షాలు మొదటి నుంచి అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన లేఖతో మరిన్ని అనుమానాలను లేవనెత్తుతున్నారు. అపోలో హెల్త్ బులెటిన్‌కు, ఎయిమ్స్ డాక్టర్ల నివేదికకు వ్యత్యాసం ఉందని స్టాలిన్, రాందాస్‌లు అన్నారు.

అపస్మారకస్థితిపై డౌట్స్

అపస్మారకస్థితిపై డౌట్స్

కొన్ని రోజుల్లో జయ ఇంటికి చేరుకుంటారని అపోలో వైద్య బృందం సెప్టెంబర్ 25న చెప్పగా, తాజా ఎయిమ్స్ నివేదికలో మాత్రం సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరే నాటికే అపస్మారక స్థితిలో ఉన్నారని ఉందని, ఇది పొంతన లేని విధంగా ఉందని స్టాలిన్ అన్నారు.

ఎన్నో అనుమానాలు

ఎన్నో అనుమానాలు

అలాగే అపస్మారక స్థితిలో ఉంటే ఉప ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై వేలిముద్రలు ఎలా వేశారని నిలదీశారు. అదే సమయంలో జయకు ఎలాంటి చికిత్స అందించారో తనకు తెలియదని పన్నీరు చెప్పగా, అన్ని విషయాలు ఆయనకు చెప్పామని ప్రకటనలో చెప్పారని, ఏది నమ్మాలని స్టాలిన్ అడిగారు.

దినకరన్‌తో నో

దినకరన్‌తో నో

మరోవైపు, అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు వరుస షాకులు తగులుతున్నాయి. జయలలిత మృతిపై ఓ వైపు అనుమానాలు వ్యక్తమవుతుండగా మరోవైపు పలువురు నేతలు.. పార్టీ డిప్యూటీ చీఫ్ దినకరన్‌పై అసంతృప్తితో ఉన్నారు. పలువురు నేతలు దినకరన్‌తో కలిసి పని చేసేందుకు నో చెబుతున్నారు

English summary
Former minister ponnaiyan says that Apollo has relationship with the people who are the reason for Jayalalitha's death.three hours before of jayalalitha taken to the hospital the black cats has sent out from Poes garden Ponnaiyan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X