వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో 10వేల మంది భద్రతా బలగాలను ఎందుకు దింపుతున్నారు...?

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌ లోయలో 10వేల మంది పాలమిలటరీ బలగాలను ఎందుకు దింపుతున్నారు...? కశ్మీర్ ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్స్‌ను తొలగించేందుకేనా.. లేదంటే కశ్మీర్‌లో మరోసారి తీవ్రవాదులు విధ్వంసం చేలరేగపోతుందా.. ? ఇప్పటికే తీవ్రవాదులను మట్టబెడుతున్న ప్రభుత్వానికి తీవ్రవాదులు సవాల్ విసరనున్నారా అందుకే భారి మొత్తం లో బలగాగాను కశ్మీర్‌లో దింపుతున్నారా..? అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కౌంటర్ టెర్రరిజం అధికారులతో ఆదివారం జమ్ము కశ్మీర్‌‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

భద్రతా దళాల తరలింపు పై అనుమానాలు

భద్రతా దళాల తరలింపు పై అనుమానాలు

కశ్మీర్‌ లోయలో 100 పార మిలిటరీ ట్రూప్స్‌ను పంపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కశ్మీర్ ప్రాంత నాయకుల్లో అలజడిరేగుతోంది. కశ్మీర్‌కు ప్రత్యేకంగా ఉన్న 35ఏ తోపాటు 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలోనే బలగాలు కశ్మీర్‌లో దింపుతున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే స్థానిక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకోంది. అయితే ఈ వార్తలను,అనుమానాలను కేంద్రం ఇప్పటిక కొట్టిపారేసింది.

మూడు రోజుల పాటు కశ్మీర్ లో పర్యటించిన అజిత్ దోవల్

మూడు రోజుల పాటు కశ్మీర్ లో పర్యటించిన అజిత్ దోవల్

ఈ నేపథ్యంలోనే జాతీయ భద్రత సలహదారు అజిత్ దోవల్ కౌంటర్ టెర్రరిస్ట్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కశ్మీర్‌లో వెనకడుగు వేసిన తీవ్రవాదులు తిరిగి పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు సన్నద్దమవుతున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందటంతోనే భద్రతా దళాలను మోహరిస్తున్నట్టు తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖ అదేశాలతో 10వేల మంది దళాలు

కేంద్ర హోంశాఖ అదేశాలతో 10వేల మంది దళాలు

కాగా అజిత్ దోవల్ కశ్మీర్‌లో పర్యటించిన తర్వాతే భద్రతా దళాలను మోహారించారు. ఈనేపథ్యంలోనే మూడు రోజుల పాటు దోవల్ కశ్మీర్ పర్యటించిన ఆయన పోలీసులు,పార మిలిటరీ , ఇతర సంస్థల అధికారులతో విస్తృత స్థాయి సమావేశం జరిగపారు.దీంతో కేంద్ర హోంశాఖ 100 కంపనీలను అనగా పదివేల మంది భద్రతా సిబ్బందిని కశ్మీర్‌కు పంపాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది. వీరందరిని పబ్లిక్ సంస్థల సెక్యూరిటి ఉపయోగించనున్నారు. ఇప్పటికే పలు సంస్థలను భద్రతా దళాలను ఆదీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

English summary
national Security Advisor (NSA) Ajit Doval on Sunday held a meeting of the counter-terrorism grid in Jammu and Kashmir in view of a major terrorist attack threat in the Kashmir Valley.be cause of Pakistan Army-backed terrorist groups are planning to carry out a major terror attack on Indian soil
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X