• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరిహద్దులో చైనా పంజాబీ సాంగ్స్... అసలు కథ వేరే... శతాబ్దం క్రితం జరిగిన ఘటనతో లింకు...

|

దౌత్య వేదికల్లో చైనా చెబుతున్న మాటలకు... సరిహద్దులో చైనీస్ ఆర్మీ చేతలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఓవైపు చెబుతూనే... మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత భూభాగంలో దురాక్రమణకు విఫలయత్నం చేసి భంగపడ్డ చైనా ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. శత్రువును నేరుగా ఎదుర్కొనడం కంటే ముందు మానసికంగా ప్రభావితం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సరిహద్దులో పంజాబీ పాటలతో హోరెత్తిస్తోంది. భారత సైనికుల ఏకాగ్రతను దెబ్బతీసేందుకే చైనా ఈ కుయుక్తులకు పాల్పడుతోందన్న వాదన వినిపిస్తుండగా... దీనికి సంబంధించి మరో ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది.

  India-China Face Off : Indian Army ఏకాగ్రతను దెబ్బతీసేలా Punjabi songs ప్లే చేస్తున్న China
  అప్పట్లో బాక్సర్ తిరుగుబాటు...

  అప్పట్లో బాక్సర్ తిరుగుబాటు...

  భారత్-చైనా ఘర్షణ ప్రాంతాల్లో ఒకటైన రేజంగ్ లా రేచిన్‌కు చైనా భూభాగంలోని చుశూల్ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ మెస్ పెద్ద దూరమేమీ కాదు. శతాబ్ద కాలం క్రితం ఇక్కడి మెస్‌లో పలు కళాఖండాలతో పాటు బంగారంతో చేసిన లాఫింగ్ బుద్ద విగ్రహం ఉండేది. అప్పట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు,విదేశీ మిషనరీలతో ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలతో వివాదాల కారణంగా చైనాలో బాక్సర్ తిరుగుబాటు మొదలైంది. యువ రైతులు,కార్మికుల నేత్రుత్వంలో నడిచిన ఈ ఉద్యమంతో చైనా అట్టుడికింది. ఈ ఉద్యమ సందర్భంగా దాదాపు 400 మంది విదేశీయులను తిరుగుబాటుదారులు నిర్బంధించారు.

  ఆ విజయంలో సిక్కు రెజిమెంట్ కీలక పాత్ర

  ఆ విజయంలో సిక్కు రెజిమెంట్ కీలక పాత్ర

  చైనాలో ఉవ్వెత్తున ఎగిసిన ఈ బాక్సర్ ఉద్యమాన్ని అణచివేసేందుకు 'ఎనిమిది దేశాల మిషన్' ఒకటి ఏర్పాటైంది. ఇందులో భారత్ నుంచి బ్రిటీష్ ఆర్మీ కూడా ఒకటి. ఈ మిషన్ తరుపున దాదాపు

  దాదాపు 20వేల మంది సైన్యం చైనా తిరుగుబాటుదారులపై పోరాడి విజయం సాధించింది. ఇందులో భారత బ్రిటీష్ ఆర్మీకి చెందిన సైనికులు 8వేల మంది కాగా... అందులో ఎక్కువమంది సిక్కు,పంజాబ్ రెజిమెంట్‌కి చెందినవారే.

  లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని తీసుకొచ్చేసిన ఆర్మీ...

  లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని తీసుకొచ్చేసిన ఆర్మీ...

  బాక్సర్ తిరుగుబాటును అణచివేశాక బ్రిటీష్ ఆర్మీ చైనాలో లూటీలకు పాల్పడిందని చెబుతారు. ఫ్రెంచ్,రష్యన్ ఆర్మీ చాలామంది పౌరులను చంపేయడంతో పాటు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు చెబుతారు. అదే సమయంలో చుశూల్‌లోని ఆర్మీ మెస్‌లో ఉన్న కళాఖండాల్లో ఒకటైన లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని బ్రిటీష్ ఆర్మీ భారత్‌కు తీసుకొచ్చింది. అప్పటి బ్రిటీష్ సైన్యంలోని సిక్కు రెజిమెంటే ఈ పనిచేసినట్లుగా చెబుతారు. అలాగే 1368-1644 మింగ్ రాజవంశుల కాలానికి చెందిన ఓ కాంస్య గంటను కూడా బ్రిటీష్ ఆర్మీ లూటీ చేసినట్లు చెబుతారు. అయితే 1995లో ఇండియన్ ఆర్మీ తిరిగి దాన్ని బీజింగ్‌కి అప్పగించింది.

  చైనా ఇంకా మర్చిపోలేదా...?

  చైనా ఇంకా మర్చిపోలేదా...?

  శతాబ్ద కాలం క్రితం జరిగిన ఆ సంఘటనలను చైనా ఇంకా మరిచిపోలేదన్న వాదన వినిపిస్తోంది. సరిహద్దులో చైనా ఇప్పుడు లౌడ్ స్పీకర్లతో పంజాబీ పాటలను ప్లే చేయడానికి బహుశా ఇదే కారణమై ఉండవచ్చునని భారత ఆర్మీకి చెందిన ఓ కమాండర్ అభిప్రాయపడ్డారు. సిక్కు సైనికుల ఏకాగ్రతను దెబ్బతీసేందుకే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.

  English summary
  The statue of the Laughing Buddha at the army mess in Chushul was one of the items brought back by the soldiers. A gilded bronze bell dating back to the 1368-1644 Ming dynasty - one of the missing 16 - looted by a British general, was eventually returned by the Indian Army to Beijing’s Temple of Heaven in 1995.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X