వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా సందేశం ఓకే! కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి రాకపోతే..: సీఏఏపై ప్రశాంత్ కిషోర్, బ్రాండ్ మోడీపై నో

|
Google Oneindia TeluguNews

పాట్నా: రాజకీయ వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)కి సంబంధించిన నిరసనలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పాల్గొనడం లేదని విమర్శించారు.

 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత</a><a class=" title=" 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత" /> 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత

సోనియా సందేశం ఓకే కానీ..

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రం, బీజేపీపై విమర్శలు చేస్తూ చేసిన వీడియో స్టేట్‌మెంట్‌ను చూశానని ట్విట్టర్ వేదికగా చెప్పారు. కాగా, శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్సీలపై సోనియా గాంధీ స్పందిస్తూ.. బీజేపీ ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్.. సోనియా గాంధీ వీడియోను రీట్వీట్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు స్పందించకపోతే సోనియా గాంధీ విమర్శలకు అర్థం ఉండదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.

నితీష్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రశాంత్ కిషోర్...

నితీష్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రశాంత్ కిషోర్...

పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ప్రశాంత్ కిషోర్ మాత్రం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే, పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎన్ఆర్సీకి మాత్రం మద్దతు తెలిపేది లేదని, తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పస్టం చేశారు.

మోడీ బ్రాండ్, బీజేపీపై ప్రభావం ఉండదు..

మోడీ బ్రాండ్, బీజేపీపై ప్రభావం ఉండదు..

సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. బీజేపీ, బ్రాండ్ మోడీ ఇమేజ్‌పై ఈ నిరసనలు ప్రభావం చూపవని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ ఆందోళనలు ప్రస్తుత అంశాల వరకే ఉంటాయని, బీజేపీ, మోడీపై గానీ వీటి ప్రభావం ప్రతికూలంగా ఉండకపోవచ్చని తెలిపారు. ఆ తర్వాత బీజేపీకి, బ్రాండ్ మోడీకి ఆదరణ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు.

సోనియా ప్రత్యేక వీడియో సందేశం..

కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలుకుతున్నదని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ తెలిపారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, ప్రజలపట్ల కేంద్రం అతిక్రూరంగా వ్యవహరిస్తున్నది, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దమననీతికి చోటులేదని ఆమె అన్నారు. సీఏఏ నిరసనోద్యమం నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక వీడియో ద్వారా దేశప్రజలకు సోనియా తన సందేశం పంపారు. పౌరసత్వ సవరణ చట్టం ముమ్మాటికి సమాజంలో చీలికను, భేదభావాల్ని పెంచుతుందని సోనియా అభిప్రాయపడ్డారు.

English summary
Prashant Kishor questioned why the Congress leaders were not on the streets protesting against the Citizenship Amendment Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X