వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ దెబ్బ: ధక్షిణ, మధ్య గుజరాత్‌ల్లో కమలానిదే హవా, బిజెపికి షాకిచ్చిన రాహుల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్; గుజరాత్ రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకొంది. అయితే ఆ పార్టీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీకి ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో బిజెపికి కాంగ్రెస్ షాకిచ్చింది. దక్షిణ గుజరాత్, మధ్య గుజరాత్‌లో బిజెపికి ఆధిక్యత కనబర్చింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ ఫోల్స్‌కు అనుకూలంగానే ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో బిజెపికి ఊహించన దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో బిజెపిని కాంగ్రెస్ పార్టీ నిలువరించింది.

కాంగ్రెస్ పార్టీ నుండి ఎదురైన పోటీ కారణంగా బిజెపి కొన్ని స్థానాల్లో ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యవహరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను అనుసరిస్తే ఆ పార్టీకి మరింత ప్రయోజనం కలిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

 బిజెపికి కలిసొచ్చిన ప్రాంతాలు

బిజెపికి కలిసొచ్చిన ప్రాంతాలు

ఉత్తర గుజరాత్ లో బిజెపి 32, కాంగ్రెస్ 16, సౌరాష్ట్రలో బిజెపి 24, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నారు. అయితే గుజరాత్ రాష్ట్రంలో కనీస మెజారిటీ దగ్గర్లో బిజెపి అభ్యర్థులు ఉన్నారు. దక్షిణ గుజరాత్ లో బిజెపి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆదిక్యంలో అధిక్యంలో ఉన్నారు.

 దక్షిణ గుజరాత్‌లో బిజెపి హావా

దక్షిణ గుజరాత్‌లో బిజెపి హావా

దక్షిణ, మధ్య గుజరాత్‌లలో బీజేపీ హవా కొనసాగుతోంది.గుజరాత్‌లో బీజేపీ 101 చోట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్‌ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. దక్షిణ, మధ్య గుజరాత్‌లలో బిజెపి ప్రాబల్యం ఫలితాల్లో స్పష్టంగా కన్పిస్తోంది.

 బిజెపికి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్

బిజెపికి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్

ఈ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బిజెపిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను కూడదీసుకొంది. అయితే అదే సమయంలో ఓట్ల చీలికను నివారించడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం కారణంగా కొన్ని జిల్లాల్లో బిజెపికి ఖాతాను తెరవని పరిస్థితి నెలకొంది. గుజరాత్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో బిజెపి తీవ్రంగా నష్టపోయింది. మిగిలిన జిల్లాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహన్ని అనుసరిస్తే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

రెండు జిల్లాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్

రెండు జిల్లాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నవ్‌సారి, అర్వలి జిల్లాల్లో ఖాతా తెరవలేదు.ఏడు జిల్లాల్లో భాజపా, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. బనస్కంత, కచ్‌, బొతాద్‌, ద్వారకా, ఖేడా, మహిసాగర్‌, సబర్కంత జిల్లాల్లో రెండు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి.

English summary
Congress party lost in Navsari and Arvali districts. Bjp leads in all seats from both districts in Gujarat assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X