వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటకాలు: శశికళను మంత్రి బాలకృష్ణారెడ్డి ఎందుకు కలిశారు: పన్నీర్ గ్రూప్

తమిళనాడు రాష్ట్రంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి గ్రూపుల విలీనం ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి గ్రూపుల విలీనం ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది.అయితే శశికళను పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత పశుసంవర్థకశాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి జైలులో శశికళను కలవడం పట్ల పన్నీర్ సెల్వం గ్రూప్ మండిపడుతోంది.శశికళను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

దినకరన్ ను ఎన్నికల కమిషన్ కేసులో జైలుకు వెళ్ళిన నేపథ్యంలో పళనిస్వమి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య విలీన చర్చలు సాగాయి.అయితే శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి బహిష్కరించాలని పన్నీర్ గ్రూప్ డిమాండ్ తో వారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది పళని గ్రూప్.

అయితే ఈ రెండు గ్రూపుల మద్య రాజీ కుదరలేదు. అయితే తాజాగా జైలులో ఉన్న శశికళను రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి వై. బాలకృష్ణారెడ్డి కలవడాన్ని పన్నీర్ సెల్వం గ్రూప్ తప్పుబడుతోంది.పళనిస్వామి క్యాబినెట్ లోని మంత్రులు ఇష్లమెచ్చినట్టు మాట్లాడుతున్నారని పన్నీర్ గ్రూప్ దుయ్యబడుతోంది.

Why did animal husbandry minister meet VK Sasikala, asks OPS camp

ఈపీఎస్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి డి. జయకుమార్ మాత్రం శశికళకు పార్టీకి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ, ఆయన మంత్రివర్గసహచరుడు బాలకృష్ణారెడ్డి మాత్రం శశికళను ఎందుకు కలిశారో చెప్పాలని పన్నీర్ గ్రూప్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ ప్రశ్నించారు.

పళినిస్వామి గ్రూప్ నాటకాలు ఆడుతోందని పన్నీర్ గ్రూప్ ఆరోపణలు చేస్తోంది.మరోవైపు శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరం పెట్టడంతో పాటు జయలలిత మరణంపై విచారణ చేయించే విషయంలో పళిస్వామి గ్రూప్ సానుకూలంగానే ఉందనే అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం గ్రూప్ కు చెందిన కె. పాండిరాజన్ అభిప్రాయపడ్డారు.

English summary
Accusing the rival Edappadi K. Palanisami camp of “enacting drama” on booting out V. K. Sasikala from the AIADMK, the OPS camp on Sunday sought to know the reason behind animal husbandry minister P. Balakrishna Reddy meeting the interim general secretary of the party in Bengaluru prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X