వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట తెచ్చిన చేటు: వారి వ్యాఖ్యలే మంత్రి పదవులకు చెక్ పెట్టాయా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 58 మంత్రులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ క్యాబినెట్‌లో అమిత్ షా , జైశంకర్‌లు ప్రమాణస్వీకారం చేసి వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే మోడీ తొలి క్యాబినెట్‌లో మంత్రులుగా పనిచేసి తమ వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ సారి మంత్రి పదవి దక్కించుకోవడంలో విఫలమయ్యారు.

మేనకాగాంధీ నుంచి అనంత్ కుమార్ హెగ్డే వరకు చాలామంది మోడీ తొలి క్యాబినెట్‌లో పనిచేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన మేనకా గాంధీ ఈసారి పదవి దక్కలేదు. ముస్లింలు తనకు ఓటు వేయకుంటే తమ పనులు జరగవని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. దీంతో ఆమె మంత్రి పదవికి దూరమయ్యారని తెలుస్తోంది. తనకు ఓటు వేయకుండా తమ పనులు చక్కబెట్టుకునేందుకు ముస్లింలు వస్తే తానేమీ చేయలేనని ఆమె ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. దీంతో ఆమెపై ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే మేనకా గాంధీ ఈసారి సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు.

Why did Maneka and Ananth Kumar Hegde failed to secure cabinet berth ?
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ పోర్ట్ ఫోలియో బాధ్యతలు నిర్వర్తించిన అనంత్ కుమార్ హెగ్డేకు కూడా ఈసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి 4 లక్షల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాంగాడ్సే నిజమైన దేశభక్తుడు అని సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని అన్నందుకే ఆయనకు మంత్రి పదవి దక్కలేదనే వార్తలు బీజేపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు మరో సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శల పాలయ్యారు అనంత్ కుమార్ హెగ్డే. రాహుల్ గాంధీ తండ్రి ముస్లిం అని తల్లి క్రైస్తవురాలని కానీ చెప్పుకోవడం మాత్రం బ్రాహ్మణుడిగా చెప్పుకుంటున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనంత్ కుమార్ హెగ్డే.

అనంతకుమార్, మేనకా గాంధీల వ్యాఖ్యలతో బీజేపీ తీవ్ర ఇరకాటంలోకి పడిపోయింది. దీంతో బీజేపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన వారికి మోడీ రెండో కేబినెట్‌లో చోటు దక్కలేదు.

English summary
Narendra Modi was sworn-in as the Prime Minister for a second term on Thursday in gala event that was attended by over 8,000 high-profile guests.some former ministers who had earlier dominated headlines with their controversial statements missed the bus.From Maneka Gandhi to Anantkumar Hegde, many ministers of the first Modi government have been dropped this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X