వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాబేళ్లు తుఫానులను పసిగడతాయా ? అందుకే ఒడిశా తీరానికి రాలేదా ?

|
Google Oneindia TeluguNews

ఒడిశా లోని రుషికుల్యా బీచ్ తీరానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓలివ్ రిడ్లే తాబేళ్లు ఈ సంవత్సరం ఎందుకు రాలేదు. ప్రతి సంవత్సరం లక్షాలాదిగా తరలి వచ్చే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాబేళ్లు ఈ సీజన్‌లో మాత్రం తక్కువయ్యాయి. దీంతో తాబేళ్లు ముందు వచ్చే తుఫాను పసిగట్టాయా ? అందుకోసమే ఈ సంవత్సరం తాబేళ్లు రాలేదా ? ప్రకృతి వైపరిత్యాలను పసిగట్టే శక్తి తాబేళ్లకు ఉంటుందా ....అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

ఫోని తుఫాను బీభత్సాన్ని ముందే పసిగట్టిన తాబేళ్లు !

ఫోని తుఫాను బీభత్సాన్ని ముందే పసిగట్టిన తాబేళ్లు !

పెద్ద ఎత్తున వస్తున్న ఫొని తుఫాను బీభత్సం అంతా ఇంతా కాదు. తుఫాను నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలు ఎన్ని ఏర్పాట్లు చేసిన జరిగే నష్టం మాత్రం ఆగడం లేదు. అయితే ఇలాంటీ తుఫానులు కేవలం వారం రోజుల ముందే వాతవరణ శాఖ హెచ్చరికలు జారి చేస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఓక్కోసారి వాతవరణ శాఖ సరిగా అంచనా వేయడంలో కూడ విఫలం అవుతోంది..కాని తుఫాను ప్రభావాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రం ముందే పసిగట్టాయి.

ఒడిశా తీరానికి లక్షలాదీ తాబేళ్లు

ఒడిశా తీరానికి లక్షలాదీ తాబేళ్లు

కాని ప్రకృతి వైఫరిత్యాలతోపాటు ,తుఫానుల బీభత్సాన్ని , జంతువులు ముందే పసిగడతాయా? ముఖ్యంగా నిత్యం నీళ్లలో ఉండే తాబేళ్లు ఇందులో ముందుంటాయా అనుమానాలు రేకేత్తుతున్నాయి. ఈ అనుమానాలను నిజం చేస్తూ నిత్యం సముద్రంలో ఉండే ఓలివ్ రిడ్లే తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం ఒరిస్సాలోని రుషికుల్యా తీరానికి వస్తాయి . ప్రపంచంలో ఒరిస్సా తర్వాత మెక్సికో మరియు కోస్టారికా తీరాల్లో ఇవి ఎక్కువగా సంతానోత్పత్తిని చేస్తాయి. ముఖ్యంగా ఆడ తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం సముద్రంలో ఎక్కడికి వెళ్లినా తిరిగి తమ స్వంత తీరాలకు చేరతాయి. ఈనేపథ్యంలోనే ఒడిశా తీరానికి సుమారు ఆరు లక్షల తాబేళ్లు ప్రతి సంవత్సరం వస్తాయి. ఇవి రెండు ఫీట్ల పోడవు సుమారు 50 కిలోల బరువు ఉండే ఈ తాబేళ్లు తమ సంతోత్పత్తి కోసం సుమారు 45 నుండి 60 రోజుల పాటు ఇక్కడ మకాం వేస్తాయి. సముద్ర తీర ప్రాంతంలో రెండు ఫీట్ల లోతున గుండ్లను పొదుగుతాయి. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం తగు ఏర్పాట్లు కూడ చేస్తోంది.

తాబేళ్లు తగ్గాయంటూ ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి

తాబేళ్లు తగ్గాయంటూ ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి

అయితే రుషికుల్యా తీరానికి వచ్చిన ఓలివ్ రిడ్లే తాబేళ్ల సంఖ్య తగ్గిందని ముందుగానే తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేసిన తాబేళ్లు తమ గుండ్లు పెట్టే ప్రాంతాన్ని మార్చుకుని ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు బెంగుళూరుకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కస్వాన్ ఓ ఆశ్చర్యకరమైన అంశాన్ని ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఓలివ్ రిడ్లే తాబేళ్లు రుషికుల్యాలోని తీరానికి ఎక్కువ సంఖ్యలో చేరుకోలేదని ప్రతి సంవత్సరం లక్షాలాదీ తాబేళ్లు గుడ్లను పెట్టడానికి ఇక్కడికి వస్తాయని చెప్పారు. ఈనేపథ్యంలోనే 2017 సంవత్సరంలో సుమారు 5 లక్షల ఓలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లను పెట్టేందుకు వచ్చాయని ,కాని ఈ సంవత్సరం మాత్రం కేవలం 3000 వేల తాబేళ్లు మాత్రమే తీరానికి చేరుకున్నాయని ట్విట్టర్లో తెలిపారు. సో దీంతో తాబేళ్లు ఒరిస్సా తీరానికి తుఫాను ప్రభావం ఉండనుందని ముండే పసిగట్టాయని భావిస్తున్నారు పలువురు శాస్త్రవేత్తలు

English summary
Why the world-famous Olive Ridley turtles did not come this year on the Rishikulia beach in Orissa? The world's most popular turtles that move into the millions each have fallen short this season. Will the turtles smell before the storm? Questions about whether the turtles of nature can be perceived to be natural disasters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X