• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజీవ్‌ను చంపింది ఎల్టీటీఈ కాదు, సీఐఏనే: నమ్మించే ప్రయత్నం చేసిన‘రా’!

|

న్యూఢిల్లీ: కొద్ది నెలల ముందే బెదిరింపులు రావడంతో 1991, మే 20న రాజీవ్ గాంధీకి ఎస్పీజీని తొలగించి ఎన్ఎస్‌జీ భద్రతను కల్పించడం జరిగింది. ఆ తర్వాతి రోజే 1991మే 21న రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.అయితే, రాజీవ్ హత్యకు ముందే ఎస్పీజీని తొలగించి ఎన్ఎస్‌జీని ఎందుకు తీసుకొచ్చారో తెలియలేదు. రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణలో సిబీఐ విచారణాధికారి రఘోత్తమన్ ఈ కీలక ప్రశ్నలనే లేవనెత్తారు.

వన్ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రఘోత్తమన్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఒక నెలలోనే రాజీవ్ భద్రతను తొలగించారు. ఢిల్లీ పోలీసులు మాత్రమే ఆయనకు భద్రత కల్పించారు. హత్య హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో రాజీవ్‌కు భద్రత పటిష్టం చేయాల్సింది పోయి తగ్టించడం చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాతోపాటు పలు అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఈ హెచ్చరికలు అందుకున్నాయి.

బెదిరింపులు రావడం అనేది ఊహించలేనిదని ఆయ అన్నారు. 1991, మే 20న ఎన్ఎస్జీ భద్రత కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది జరిగిన తర్వాతి రోజే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. హెచ్చరికలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజీవ్‌కు భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారనేది రఘోత్తమన్ ప్రశ్న.

వీడియో ఏది?

వీడియో ఏది?

శ్రీపెరంబుదూర్‌కు రాజీవ్ గాంధీ వచ్చిన వీడియో ఏది? అని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ వచ్చిన తర్వాత కూడా వీడియో తీశారు. ఆ వీడియో కూడా లభించడం లేదు. ఐబీ డైరెక్టర్ ఆ వీడియో టేప్‌ను తీసుకున్నారు గానీ.. ఇప్పటి వరకు బయటికి తీసుకురాలేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని ఆయన అన్నారు.

ఓ సీనియర్ అధికారి ఆ ముఖ్యమైన వీడియోను దాచిపెట్టారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ధనూ కూడా ఆ వీడియోలో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే.. ఇంటెలీజెన్స్ ఏజెన్సీల కంటే కూడా జర్నలిస్టులే ఈ కేసు విచారణలో చాలా ఉపయోగపడ్డారని రఘోత్తమన్ తెలిపారు.

ఎల్‌టీటీఈ కాదు.. సీఐఏనే?

ఎల్‌టీటీఈ కాదు.. సీఐఏనే?

రాజీవ్ హత్య ఎల్‌టీటీఈ పని కాదని హత్య అనంతరం ఆర్అండ్ఏడబ్ల్యూ చీఫ్ తెలిపారు. అయితే, మే30న సిట్ మాత్రం.. ఎల్టీటీఈ పాత్ర ఉందన్నట్లుగా ఆర్అండ్ఏడబ్ల్యూ అధిపతికి తెలియజేసింది. దీన్ని అంగీకరించకుండా, ఇది సీఐఏ పని అని తెలిపారు. లండన్‌ చెందిన ఎల్‌టీటీఈ ఆపరేటివ్ కిట్టూ గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ది ఆర్అండ్ఏడబ్ల్యూ విచారణను పక్కదారి పట్టిస్తూ తప్పుడు వార్తలను తీసుకుంటూ రాజీవ్ గాంధీని చంపింది సీఐఏ అని, ఎల్‌టీటీఈ కాదని పేర్కొంది. అప్పటి హోంమంత్రి కూడా పార్లమెంటులో ఐఏఏనే ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పారు. ఐబీ, ఆర్అండ్ఏడబ్ల్యూ తప్పుదారి పట్టించాయని చెప్పారు.

ఇంటెలీజెన్స్ నుంచి సాయం లేదు

ఇంటెలీజెన్స్ నుంచి సాయం లేదు

రాజీవ్ హత్య కేసు విచారణలో ఆర్అండ్ఏడబ్ల్యూ ఏమాత్రం సాయమందించలేదు. కేసులో ఏలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కిట్టూ కోసం వెదికినా కూడా యూకే ప్రభుత్వం అతడ్ని అప్పగించేందుకు అంగీకరించలేదు. 1993లో ఛార్జీ వేయడంతో అతడు దిగివచ్చారు. అయితే, కేంద్రం మాత్రం అతడ్ని చంపేయాలని ఆదేశించింది. ఆర్అండ్ఏడబ్ల్యూ కూడా అతడ్ని చంపేందుకే మొగ్గుచూపింది.

ప్రభాకరణ్‌కు అంతర్జాతీయ సంబంధాలుండటానికి కిట్టూ ప్రధాన పోషిస్తున్నాడు. ఇతడి తర్వాత అంటోన్ బాలసింగమ్‌కు అంతర్జాతీయ సంబంధాలున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. జాఫ్నాలో ఉన్న అంటోన్‌కు ఈ హత్యతో సంబంధం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రఘోత్తమన్ తెలిపారు. దీనికి సంబంధమున్న మరో వ్యక్తి కేపీ అని చెప్పారు.

పీఈ గురించి ఏమిటీ?

పీఈ గురించి ఏమిటీ?

సిట్ ద్వారా ఏర్పడిన వర్మ కమిషన్(ప్రైవేట్ ఎంక్వైరీ-పీఈ) నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సరైన విచారణ ఎందుకు జరగలేదని రఘోత్తమన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు విచారణ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాతే పార్లమెంటు దీనిపై స్పందిస్తుంది. విచారణకు సంబంధించిన సింగిల్ డాక్యుమెంట్ కూడా రాలేదు. ఇంటెలీజెన్స్ ఏజెన్సీలు పేర్లు, ఇతర సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

శివరసన్ పట్టుకోవడంలో ఆలస్యం

శివరసన్ పట్టుకోవడంలో ఆలస్యం

కోననకుంటేలో తలదాచుకుంటున్న శివరసన్ ప్రధాన నిందితుడని ఏజెన్సీలకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలూ లేవు. ఈ సమాచారం చాలా ఆలస్యంగా అందించబడింది. ఎల్టీటీఈ సెనైడ్ కల్చర్ గురించి ఏజెన్సీలకు బాగా తెలుసు. కాగా, ఎన్ఎస్జీ ఘటనా స్థలానికి ఒక రోజు ఆలస్యంగా చేరుకోవడంతో ఘటనకు సంబంధించిన నెగటివ్స్, కీలక డాక్యుమెంట్లను కాల్చేశాడు శివరసన్. అతడు ఇంకా కొంత కీలక సమాచారాన్ని మాత్రం ధ్వంసం చేయలేకపోయాడు.

English summary
Why was the SPG cover for Rajiv Gandhi withdrawn? Why was the decision to give him NSG cover taken only on 20th May 1991 when the threat perception was known months in advance. Rajeev Gandhi was assassinated on May 21 1991. These are some key questions asked by K Raghothaman, the CBI's lead investigator in the Rajiv Gandhi assassination case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X