• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహా పోలీసులకు బాంబే హైకోర్టు ప్రశ్న: కోర్టులో విచారణ జరుగుతుండగా మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు?

|

ముంబై: మానవహక్కుల నేతల అరెస్టు అంశం న్యాయపరిధిలో ఉండగా మీడియా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. వెంటనే రాష్ట్ర పోలీస్ శాఖ సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పూణేలో ఓ కార్యక్రమం జరగడం తద్వారా భీమాకొరెగావ్‌లో చెలరేగిన అల్లర్లపై విచారణ చేయాల్సి ఉందని జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషన్‌కు సంబంధించిన కాపీలు సంబంధింత వ్యక్తులకు అందలేదని చెబుతూ సెప్టెంబర్ 7కు కేసు వాయిదా వేసింది.

జనవరి 1న జరిగిన భీమాకొరెగావ్ ఘటనకు కారణం దళిత హక్కుల నేతలే నంటూ వారే ఎల్గర్ పరిషద్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆరోపించారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)నుంచి నిధులు అందాయని పోలీసులు ఆరోపించారు. భీమా కోరెగావ్ ఘటనపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించినట్లు నితిన్ సత్పుటే తెలిపారు. కోర్టు ఎన్ఐఏకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని ఆయన అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా పోలీసులు మీడియా సమావేశం పెట్టడమేంటంటూ ప్రశ్నించారు.

Why do you have to address the media when matter is subjudice,police questioned by Bombay HC

పోలీసులు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెట్టేందకు ఎందుకు వెనకాడుతున్నారని లాయరు ప్రశ్నించారు. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి డిఫెన్స్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఇది పూర్తిగా జోక్యం చేసుకోవడమే అవుతుందని అన్నారు. ఇదే విషయం న్యాయస్థానం ప్రస్తావించిందని సెప్టెంబర్ 7లోగా సమాధానం ఇవ్వాలని చెప్పినట్లు లాయర్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే శుక్రవారం అరెస్టయిన ఐదుగురు కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరమ్ బీర్ సింగ్ మీడియా సమావేశంలో లేఖలు చదివారు. అంతేకాదు మావోల నుంచి వేల సంఖ్యలో లేఖలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాదు కొన్ని లేఖల్లో గ్రెనేడ్లను కొనేందుకు నిధులు సమకూర్చుకోవాలని రాసిఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bombay High Court on Monday asked the Maharashtra Police why its officers had addressed a press conference on the arrests of five activists when the matter is still sub-judice.It has sought a reply from the state.The court was hearing a petition demanding inquiry by the National Investigation Agency into an event in Pune that reportedly triggered violence in Bhima Koregan near Pune on January 1. The court said copies of the petition had not been served to all concerned persons, and adjourned the matter for September 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more