వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ దంపతుల తాజ్‌మహల్‌ సందర్శనలో అడ్డంకులు..? తలలు పట్టుకుంటున్న అధికారులు...

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ దంపతుల భారత పర్యటన ఆగ్రా అధికారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ నెల 24, 25వ తేదీల్లో సతీసమేతంగా ట్రంప్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం భార్య మెలొనియాతో కలిసి ప్రేమకు చిహ్నాం తాజ్‌మహల్‌ను సందర్శించబోతున్నారు. కానీ తాజ్ మహల్ సమీపం వరకు ట్రంప్ 'బీస్ట్' కారును తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతకుముందు రైల్వే బ్రిడ్జీని కూడా దాటాలి. ఈ రెండింటికీ సంబంధించి ఆగ్రా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలా అని దిక్కులు చూస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ కంట పడకుండా మురికివాడలకు అడ్డుగోడ: అప్పట్లో బిచ్చగాళ్లను తరలించినట్టే..!డొనాల్డ్ ట్రంప్ కంట పడకుండా మురికివాడలకు అడ్డుగోడ: అప్పట్లో బిచ్చగాళ్లను తరలించినట్టే..!

బీస్ట్ కారే..

బీస్ట్ కారే..

ఇతర దేశాల్లో పర్యటించే సమయంలో కూడా ‘బీస్ట్' వాహనాన్నే అమెరికా అధ్యక్షుడు ఉపయోగిస్తారు. ఆగ్రా ఖేరా విమానాశ్రయానికి జంబో వాహనం చేరుకొన్నది. దీంతో ఆగ్రా అధికారుల టెన్షన్ మరింత పీక్‌కి చేరింది. 16వ శతాబ్దానికి చెందిన చారిత్రాక కట్టడం తాజ్‌మహల్ సమీపం వరకు వాహనాలను అనుమతించరు. తాజ్‌మహల్ వరకు వెళితే చారిత్రాక కట్టడం దెబ్బతినే ప్రమాదం ఉందని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిని ఆగ్రా అధికారులు పరిగణలోకి తీసుకుంటూ..ఏం చేయలా అని ఆలోచిస్తున్నారు.

పదుల సంఖ్యలో కార్లు..

పదుల సంఖ్యలో కార్లు..

ట్రంప్ కాన్వాయ్‌లో పదుల సంఖ్యలో కార్లు ఉంటాయి. వాటి బరువు 6.4 టన్నులకు పైగానే ఉంటుంది. ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్ రావాలంటే మధ్యలో రైల్వే ఓవర్ బ్రిడ్జీ దాటాలి. కిలోమీటర్ దూరం ఉన్న బ్రిడ్జీపై తేలికపాటి బరువు ఉన్న వాహనాలనే అనుమతిస్తారు. ట్రంప్ కాన్వాయ్ బరువు బస్సు మాదిరిగా ఉంటుంది. ఈ క్రమంలో బ్రిడ్జీపై నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలా వద్దా అనే మళ్లగుళ్లాలు పడుతున్నారు.

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

తాజ్‌మహల్ వద్దకు ట్రంప్ వాహనం వెళ్లడంపై ఇప్పటివరకు అధికారులకు స్పష్టతలేదు. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు తాజ్‌మహల్ సమీపంలోకి వాహనాలను అనుమతించొద్దని ఆగ్రా సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వారంకర్ పేర్కొన్నారు. దీనిపై ఆగ్రా పరిపాలన విభాగమే స్పందించాల్సి ఉందని పేర్కొన్నారు.

Recommended Video

US President Donald Trump To Visit India On Feb 24-25 || Oneindia Telugu
బ్యాటరీతో నడిచే బస్సు..?

బ్యాటరీతో నడిచే బస్సు..?

వసంత్ స్వరంకర్ వాదన ఇలా ఉంటే మరోవైపు ఆగ్రా అభివృద్ధి సంస్థ బ్యాటరీతో నడిచే బస్సును రూపొందించింది. ఇందులో సకల సదుపాయాలు కల్పించింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగించొచ్చు.. కానీ ఇది ట్రంప్ దంపతుల కోసమే తయారు చేశారా..? లేదంటే మరో కారణం ఉందా అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.

English summary
agra district administration is pulling out all the stops to give a facelift to ahead of US President Donald Trump and First Lady Melania Trump’s visit here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X