• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజస్తాన్ అస్థిరత్వానికి కారణం అదే..? సచిన్ పైలట్ డిమాండ్ ఇదే, అందుకే సోనియా పిలిచి మాట్లాడలే...

|

రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అంపశయ్య మీద కొనసాగుతోంది. కీలక నేత సచిన్ పైలట్ తిరుగబావుటా ఎగరవేశారు. అతని ధిక్కార స్వరం ఇప్పుడే బయటకొచ్చినా.. అంతకుముందే హై కమాండ్ పెద్దలకు తన వాదన వినిపించినట్టు తెలుస్తోంది. ఇందుకు పలు కారణాలు చెప్పగా.. సీఎం పోస్టుపై మాత్రం పట్టుబట్టినట్టు సమాచారం. దీంతోపాటు పలు అంశాలను దూతల ద్వారా సోనియా, రాహుల్‌కు పైలట్ సమాచారం పంపించారు. కానీ అటు నుంచి రిప్లై రావడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. ఇంత జరుగుతోన్న కాంగ్రెస్ హై కమాండ్ సచిన్‌తో చర్చలు ఎందుకు జరపలేదు. కారణాలేంటీ..?

  Rajasthan Political Crisis:Sachin Pilot VS Ashok Gehlot రాజస్థాన్ లో అంపశయ్య మీద కాంగ్రెస్ ప్రభుత్వం

  మైనారిటీలో గెహ్లట్ సర్కార్..?, సీఎల్పీ మీటింగ్‌కు డుమ్మా, తనతో 30 మంది ఎమ్మెల్యేలు: సచిన్ పైలట్

  నమ్మినబంటే.. కానీ...

  నమ్మినబంటే.. కానీ...

  గాంధీ-నెహ్రూ కుటుంబానికి పైలట్ కుటుంబం అండగా ఉంటూ వస్తోంది. సచిన్ పైలట్ తండ్రి.. రాజేశ్ పైలట్ కూడా నమ్మకంగా ఉన్నారు. సచిన్ కూడా రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉంటారు. కానీ రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం రేసులో ముందువరసలో ఉన్నది సచిన్ పైలట్ మాత్రమే.. కానీ సోనియా గాంధీ మాత్రం సీనియర్లకు పదవీ ఇవ్వాలని భావించి.. అశోక్ గెహ్లట్‌కు ముఖ్యమంత్రి పదవీ అప్పగించారు. అప్పటి నుంచి సచిన్ పైలట్ రగిలిపోతున్నారు.

  నోటీసులు ఇవ్వడంతో..

  నోటీసులు ఇవ్వడంతో..

  ఇటీవల గెహ్లట్ ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సచిన్ పైలట్‌కు సమన్లు జారీచేయడంతో వివాదం పీక్‌కి చేరింది. డిప్యూటీ సీఎంకు నోటీసులు జారీచేయడంతో.. గెహ్లట్, పైలట్ మధ్య వివాదం మరోసారి బయటపడింది. తర్వాత మిన్నకుండిపోయిన పైలట్.. తర్వాత లాభం లేదనుకొని తిరుగుబాటు ఎగరవేశారు. ఈ క్రమంలో సోనియా, రాహుల్ గాంధీ దూతలు సచిన్ పైలట్‌తో మంతనాలు జరిపారు.

  సీఎం పోస్టు కోసమే...

  సీఎం పోస్టు కోసమే...

  సచిన్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవీ ఇవ్వాలని పట్టుపట్టారు. కానీ హై కమాండ్ మాత్రం అతని డిమాండ్‌ను అంగీకరించలేదు. సీఎం పదవీకి అనుభవం కావాలని.. ఇంకా రాలేదని చెప్పించింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవీ సహా రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్, ఐదు మంత్రి పదవులకు ఇంచార్జీ కూడా అప్పగించామని తెలిపారు. దీంతో సచిన్ పైలట్ తాను ఆశించింది దొరకదని భావించారు. తాను మరో పార్టీలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అనుకొని.. ఆ దిశగా అడుగులేసినట్టు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.

  కాంగ్రెస్ పార్టీకి..

  కాంగ్రెస్ పార్టీకి..

  మార్చిలో జ్యోతిరాదిత్య సిందియా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో అధికారం చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభ ఎన్నికల సమయంలో కూడా సచిన్ పైలట్ బీజేపీతో చేతుల కలిపారని ఆరోపణలు వచ్చాయి. కానీ పైలట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి.. మూడు సీట్లలో నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో ఆ సమయంలో చేసిన ఆరోపణలు అలానే ఉండిపోయాయి. కానీ క్రమంగా వ్యతిరేకత ఏర్పడేందుకు మాత్రం కారణమయ్యింది.

  కుటుంబమే.. కానీ

  కుటుంబమే.. కానీ

  వాస్తవానికి తాను కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేను అని చివరి వరకు సచిన్ పైలట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే తన కుటుంబం అని పేర్కొన్నారు. కానీ సొంత ప్రభుత్వం తనకు నోటీసులు పంపించడం బాధించిందని చెప్పారు. తన మద్దతుదారులను తీవ్రంగా బాధించిందని.. పార్టీలో ఉండటం సరికాదని వారు సూచించారని పేర్కొన్నారు. వారి కోరిక మేరకు మరో పార్టీలోకి వెళ్లడం తప్పడం లేదు అని ఓ జర్నలిస్టుతో సచిన్ పైలట్ పేర్కొన్నారు.

  ముఖ్యమంత్రి పీఠం..

  ముఖ్యమంత్రి పీఠం..

  పార్టీ వీడే సమయంలో తాను ఏడాది నుంచి సోనియా, రాహుల్‌ను కలిసేందుకు ప్రయత్నించానని.. జ్యోతిరాదిత్య సిందియా గుర్తుచేశారు. కానీ తనకు వారు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. కానీ 9 రోజుల క్రితం పైలట్‌తో సోనియా అనుచరులు మంతనాలు జరిపారు. కానీ ఆయన సీఎం పదవీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇదే ఆయన డిమాండ్ అని సోనియా, రాహుల్ అండ్ కో భావించారు. ప్రస్తుతం గెహ్లట్‌ను తప్పించేందుకు కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధంగా లేదు. అందుకే సచిన్ పైలట్‌ను పిలిచి మాట్లాడలేదని తెలుస్తోంది. ఒకవేళ పిలిచినా ఆయన మాత్రం సీఎం పోస్టుపై పట్టుబట్టేవారు అని.. అందుకే దూరం పెట్టారని సమాచారం.

  English summary
  Gandhis reportedly told sachin pilot, he would, at some point, become Chief Minister but it would take time and that he was young enough to wait.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more