వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ అంబానీ ఫ్యామిలీ అయితే... ఆ కారును ఎందుకంత దూరంలో పార్క్ చేసినట్లు...?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ వ్యాపార దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంబానీ నివాసం అంటిల్లాకు 400మీటర్ల దూరంలో ఈ వాహనాన్ని గుర్తించారు.స్కార్పియోలో అగంతకుడు రాసిన బెదిరింపు లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో అంబానీ కుటుంబంపై దాడి జరుగుతుందని అగంతకుడు లేఖలో హెచ్చరించాడు. అయితే అంబానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడుకు ప్లాన్ చేసిన ఆ అగంతకుడు... స్కార్పియో వాహనాన్ని అంబానీ ఇంటి వద్ద కాకుండా 400మీ. దూరంలో ఎందుకు పార్క్ చేశాడు...? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రశ్నకు పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిజానికి ముకేశ్ అంబానీ నివాసం అంటిల్లా వద్దనే స్కార్పియోను పార్క్ చేయాలని అగంతకుడు భావించాడన్నారు. కానీ పలుమార్లు అక్కడ నిర్వహించిన రెక్కీలో... అక్కడి భద్రతను చూశాక కారును కాస్త దూరంలో పార్క్ చేశాడని చెప్పారు.

why gelatin laden scorpio parked 400 metres away from antilia

2013 నుంచి ముకేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉంది. ఇందులో భాగంగా మొత్తం 58 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు నిరంతరం అంబానీ కుటుంబానికి భద్రత కల్పిస్తారు. ముకేశ్ అంబానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ సెక్యూరిటీ వెళ్తారు. వీరికి కావాల్సిన సదుపాయాలను అంబానీ కుటుంబమే సమకూరుస్తుంది. అంటిల్లా గేటు ఎదుట నిత్యం డేగ కళ్లతో ఈ భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.ఎక్కడ ఏ చిన్న అనుమానాస్పద కదలిక అనిపించినా వెంటనే అప్రమత్తమవుతారు. ఆ ప్రాంతమంతా హై రిజల్యూషన్ సీసీటీవీ నిఘాలో ఉంటుంది.

సీఆర్పీఎఫ్ కమాండోలు కాకుండా అంబానీ ప్రత్యేకంగా నియమించుకున్న 15-20 సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ విధుల్లో ఉంటారు. ఇజ్రాయెల్‌కి చెందిన సెక్యూరిటీ కంపెనీతో వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించినట్లు చెప్తారు. వీరికి తోడు ముంబై పోలీసులు అక్కడ నిరంతరం భద్రతా విధుల్లో ఉంటారు. ప్రతీ రెండు గంటలకోసారి ఓ బీట్ మార్షల్ అంటిల్లా వద్దకు వచ్చి పరిసరాలను పరిశీలించి వెళ్తాడు. ఇలా ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్ చేయడం అసాధ్యం. కాబట్టే నిందితుడు అంటిల్లాకు 400మీ. దూరంలో ఆ వాహనాన్ని పార్క్ చేసి వెళ్లాడు. ప్రస్తుతం ఆ నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

కాగా,అంబానీ ఇంటి నుంచి బయటకు వెళ్తే... బుల్లెట్ ప్రూఫ్ బీఎండబ్ల్యూని వాడుతారు. అంబానీతో పాటు రేంజ్ రోవర్స్,మెర్సిడెజ్ ఏఎంజీ63 మోడల్ బెంజ్‌లో ఆయన సెక్యూరిటీ కాన్వాయ్ వెళ్తుంది. అంబానీ వాహనంతో పాటు ఆయన కాన్వాయ్‌లో మొత్తం ఆరు నుంచి ఎనిమిది వాహనాలు ఉంటాయి. ఇందులో సగం కార్లు అంబానీ కారు ముందు వెళ్తే... మరో సగం కార్లు ఆయన కారు వెనకాల వెళ్తుంటాయి.

English summary
The discovery of a gelatin-laden car near industrialist Mukesh Ambani's residence 'Antilia' on Thursday night had sent the alarm bells ringing. The car was found parked around 400 metres from the Ambani residence in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X