వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను చెబుతున్నా, నరేంద్ర మోడీ అవినీతిపరుడు: రాఫెల్ డీల్‌పై రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

నరేంద్ర మోడీ అవినీతిపరుడు : రాహుల్ గాంధీ | Oneindia Telugu

న్యూఢిల్లీ: రాఫెల్ స్కాం పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై గురువారం మరోసారి విమర్శలు కురిపించారు. రాఫెల్ స్కాంతో రూ.30 వేల కోట్లు అనిల్ అంబానీ జేబులో వేశారని తీవ్రంగా మండిపడ్డారు. రాఫెల్ డీల్‌లో రిలయన్స్‌కు భాగస్వామ్యం కేవలం ప్రతిఫలమేనని ఆరోపించారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంత హఠాత్తుగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఇంతకు మించిన అవినీతి వ్యవహారం మరొకటి ఉండదని చెప్పారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీ.. అనిల్ అంబానీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాఫెల్ ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించండి: కేంద్రానికి సుప్రీం ఆదేశంరాఫెల్ ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించండి: కేంద్రానికి సుప్రీం ఆదేశం

Why has suddenly Defence Minister rushed to France? What is the emergency?: Rahul Gandhi

రాఫెల్ డీల్ రిలయెన్స్‌తో కుదుర్చుకోవాలని తమకు భారత ప్రధాని చెప్పారని గతంలో ఫ్రెంచ్ మాజీ ప్రధాని చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు సీనియర్ అధికారి కూడా అదే విషయం చెప్పాడని అన్నారు. కాబట్టి ఇందులో పూర్తిగా అవినీతి జరిగిందని తేలిపోయిందని అన్నారు.

నిర్మలా సీతారామన్ సడన్‌గా ఫ్రాన్స్‌కు వెళ్లి, రాఫెల్ ప్లాంట్‌కు వెళ్లవలసిన అవసరం ఏమి వచ్చిందని నిలదీశారు. అంత త్వరగా వెళ్లవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. నేను ఈ దేశంలోని యువతకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిపరుడు అని తీవ్ర ఆరోపణలు చేశారు.

English summary
'Earlier former French President revealed that Indian PM had told them that Reliance should get a deal. Now a senior official of Rafale has said the same. It is a clear cut case of corruption' says, Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X