వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణం అదేనా?: 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'కు భారత్ నో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు భారత్ అంగీకరించలేదు. భారతదేశాన్ని 360 డిగ్రీల్లో చూపేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ, ఇంటిజిజెన్స్ బ్యూరోలు వ్యతిరేకించాయి. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్‌లోని నగరాలను, పర్యాటక ప్రదేశాలు, నదులను 'గూగుల్ స్ట్రీట్ వ్యూ' లో పెట్టాలన్న గూగుల్ ప్రణాళికకు భారత్ అంగీకరించలేదు. గూగుల్ ప్రతిపాదించిన స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి వస్తే భారత్‌ను 360 డిగ్రీల్లోనూ, విశాలంగా, వీధి స్థాయి వరకూ చూసేందుకు వీలవుతుంది. భారత్‌లో గతంలో జరిగిన 26/11 ముంబైలో జరిగిన దాడులకు ముందు పాకిస్థాన్-అమెరికాకు చెందిన డెవిడ్ కోల్‌మన్ హెడ్లీ ఫోటోల్లో బంధించాడు.

ఈ ఫోటోల ఆధారంగానే అప్పట్లో దాడికి ప్రణాళిక జరిగింది. ఈ అనుభవాల నేపథ్యంలో గూగుల్ ప్రతిపాదనపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆందోళన చెందింది. గూగుల్ స్ట్రీట్ వ్యూపై భద్రతా సంస్ధలు, ఇంటిలిజెన్స్ అధికారులు కూలంకుషంగా చర్చించిన తర్వాతే గూగుల్ ప్రతిపాదనను తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Why India is still not ready for Google's Street View

దేశ భద్రతకు ఇది విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిపాయి. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిపాదించిన జియో స్పేషియల్ సమాచారం నియంత్రణ బిల్లు-2016 అమల్లోకి వస్తే ఇంటర్నెట్ ఆధారితి అప్లికేషన్ సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

గూగుల్ స్ట్రీట్ వ్యూను అమెరికా, కెనడా, అనేక ఐరోపా దేశాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ స్ట్రీట్ వ్యూ కోసం ఓ కారుని ప్రత్యేకంగా రూపొందించారు. ఏ ప్రదేశంలో అయితే మనకు మ్యాప్ కావాలో ఆ ప్రదేశంలో ఈ కారుని నడుపుతారు. ఎత్తైన ప్రదేశాల్లో పర్వతారోహకుల ద్వారా ఫోటోలను తీస్తారు.

భారత్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ కింద తాజ్ మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, వారణాసిలో నది ఒడ్డు, నలంద విశ్వవిద్యాలయం, మైసూర్ కోట, తంజాఊరు దేవాలయం, చిన్నాసామి స్టేడియం తదితర పర్యాటక ప్రదేశాల్లో మాత్రమే ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

గూగుల్ స్ట్రీట్ వ్యూపై గతంలో యుకే, గ్రీస్, స్విట్జర్లాండ్, జర్మనీ, పోలాండ్ తదితర దేశాలు భద్రత విషయంలో తమ సందేహాలను వెలిబుచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా అదే భద్రత కారణాల దృష్ట్యా గూగుల్ స్ట్రీట్ వ్యూకి అనుమతివ్వడం లేదు.

English summary
India declined to give security clearance to Google's Street View. The Defence Ministry and the Intelligence Bureau objected to the proposal by Google which had planned on giving a 360 degree image of a place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X