#BoycottFood:టాప్ట్రెండింగ్ - రైతులతో లింకేంటి? ఎవరు నడిపిస్తున్నారు? ఇదీ అసలు కథ..
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏం విషయాలు ట్రెండింగ్‌లో కొనసాగుతాయో ఊహించడం కష్టం. ఒక్కోసారి అవి ఎందుకు ట్రెండ్ అవుతుంటాయో కూడా అర్థంకాక నెటిజన్స్ తలగోక్కుంటుంటారు. శుక్రవారం నుంచి అలాంటి టాపిక్ ఒకటి ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. #boycotfood అనే హ్యాష్‌ట్యాగ్ మీద వేలకొద్దీ ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఇంతకీ ఈ ట్రెండ్ వెనుక ఉంది ఎవరు? అసలేం జరిగిందంటే..
భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి -తొలిదశలో 10కోట్ల డోసులు -హెటిరోతో రష్యా ఒప్పందం

అసలేం జరిగిందంటే..
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొద్ది నెలల కిందట తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ‘ఢిల్లీ చలో' కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం నుంచి పంజాబ్, హర్యానానే కాకుండా పలు రాష్ట్రాలకు చెందిన రైతుల వేలాదిగా రైతులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. అయితే, వారిని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అన్నదాతపై పోలీసుల పాశవిక దాడిపై సోషల్ మీడియాలోనూ నిరసనలు వ్యక్తం అయ్యాయి. అందులో భాగంగా..
తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ

బాయ్‌కాట్ ఫుడ్..
ట్విట్టర్లో బాయ్‌కాట్ ఫుడ్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లిస్ట్‌లో రన్ అవుతోంది. అయితే ఈ ట్రెండ్ బీజేపీపై సెటైరిక్‌గా మొదలయ్యింది. ‘రైతులు మన ప్రియతమ నేతకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఆయన్ని అగౌరవపరిచే విషయాల్ని మేం ఎప్పటికీ సహించం. రైతులు తిరిగి ఇంటికి వెళ్లేదాకా ఏం తినొద్దని డిసైడ్ అయ్యాం. టమ్ బాణ్(సదరు పేజ్ కట్టర్ ఫాలోవర్లు).. మీరు కూడా లంచ్ మానేయండి' అని సెటైరిక్‌గా ఆ పోస్టు చేశారు. ‘రోఫ్ల్గాంధీ 2.0' అనే అకౌంట్ నుంచి తొలుత ఈ పోస్టు, హ్యాష్ ట్యాగ్ వెలువడగా, గంటల్లోనే వైరల్ అయింది. అయితే..

పప్పులో కాలేశారు..
బాయ్ కాట్ ఫుడ్ హ్యాష్ ట్యాగ్ నిజానికి రైతులకు మద్దతుగా, బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ట్రెండ్ కాగా, చాలామంది ఇదేదో ఫుడ్ ఐటమ్స్ బాయ్‌కాట్‌కి సంబంధించిన పోస్ట్ అనుకుని పొరపడ్డారు. ఇంకొందరైతే అసలు ఇందుకు ఎందుకు ట్రెండ్ అవుతుందా? అని ఆరా తీస్తున్నారు. టీమ్ బాణ్ అనేది రోఫ్ల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌కి విధేయులైన ఫాలోవర్లు. యాంటీ బీజేపీకి వ్యతిరేకంగా వీళ్లంతా ట్విట్టర్లో తరచూ పోస్టులు పెడుతుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్‌కి డిస్‌లైక్‌ల వరద పారించేది ఈ బ్యాచే. అయితే ఈ బ్యాచ్‌కి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం ఉన్నట్లు క్లారిటీ అయితే లేదు.

ఎట్టకేలకు అనుమతి..
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యాణా, యూపీ రైతులు ఛలో ఢిల్లీకి పిలుపు ఇచ్చారు. నవంబర్ 26- 27 తేదీలలో ఆందోళనకు అనుమతులు కోరితే.. దొరకలేదు. అయినప్పటికీ రైతులు మార్చ్ నిర్వహించగా, పోలీసులు.. బారికేడ్లు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్‌తో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు శుక్రవారం మధ్యాహ్నానికి రైతులను ఢిల్లీలోకి అనుమతించారు. అయితే పోలీసు ఎస్కార్ట్ మధ్యే వారు నగరంలోకి అడుగు పెట్టాలని షరతు విధించారు. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, సంయుక్త్ కిసాన్ మోర్చా నాయకుల మధ్య చర్చల తరువాత ఢిల్లీ బురారీలోని నిరంకారి మైదానంలో రైతులు నిరసన తెలిపేందుకు అనుమతి లభించింది.