బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య ల్యాండ్ కానుంది. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయాణం జూలై 22 ప్రారంభం కాలేదు. అంతకుముందే కొన్నేళ్ల క్రితమే చంద్రయాన్‌ ప్రయాణానికి బీజం పడింది. ఈ మిషన్ కోసం అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రణాళికను రచించింది.ఇక చంద్రయాన్-2 నిజం చేసేందుకు శాస్త్రవేత్తలు నిత్యం కష్టపడ్డారు. ఇందులో ఈమిషన్‌ను లాంచ్‌ప్యాడ్‌లో పెట్టేందుకు అత్యంత కష్టపడ్డారు శాస్త్రవేత్తలు. జీఎస్ఎల్‌వీ ఎంకే 3లాంచ్ వెహికిల్‌లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లను అమర్చారు.

 చంద్రుడిపై చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను ప్రతి ఒక్కరూ వీక్షించాలి: ప్రధాని మోడీ చంద్రుడిపై చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను ప్రతి ఒక్కరూ వీక్షించాలి: ప్రధాని మోడీ

చంద్రయాన్ ప్రాజెక్టు ఖర్చు రూ.978 కోట్లు

చంద్రయాన్ ప్రాజెక్టు ఖర్చు రూ.978 కోట్లు

ఇక ఇంత భారీ ప్రయోగంకు తక్కువ ఖర్చు అయ్యిందంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం. కేవలం రూ.978 కోట్లు మాత్రమే చంద్రయాన్-2 కోసం ఖర్చు చేయడం జరిగింది. అంటే ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్‌ కంటే తక్కువే కావడంతో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. సాధారణంగా రూ.978 కోట్లు అంటే వామ్మో ఇంత బడ్జెటా అని అనిపిస్తుంది.కానీ అంతరిక్షరంగంలో చేసే ప్రయోగాల్లో ఇది తక్కువ బడ్జెట్‌గానే చూస్తారు. గతంలో చంద్రుడిపైకి వెళ్లిన మిషన్‌ల కంటే చంద్రయాన్-2 బడ్జెట్ తక్కువగా ఉండటం విశేషం.

 చంద్రయాన్-2 మొత్తం ప్రయోగంకు అంత తక్కువ ఖర్చు ఎందుకైంది..?

చంద్రయాన్-2 మొత్తం ప్రయోగంకు అంత తక్కువ ఖర్చు ఎందుకైంది..?

చంద్రయాన్-2కు మొత్తం అయిన ఖర్చు రూ.978 కోట్లు . ఇందులో రూ.603 కోట్లు ఆర్బిటార్, ల్యాండర్, రోవర్, నేవిగేషన్, గ్రౌండ్ సపోర్ట్ నెట్‌వర్క్‌కోసం ఖర్చు చేశారు. ఇక వీటిని నింగిలోకి మోసుకెళ్లే రాకెట్ జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) కోసం రూ.375 కోట్లు ఖర్చు చేశారు. ఇదిలా ఉంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల పలు నెగిటివ్‌ ఫలితాలకు కారణమైంది. నింగిలోకి మోసుకెళ్లే పరికరాలు అతి తక్కువగా ఉండేలా ఇస్రో ప్లాన్ చేసింది. దీంతో ఖర్చు తక్కువైంది. ఇక 2013లో అంగారకుడిపైకి ఉపగ్రహం పంపిన సమయంలో కూడా ఇదే విధానాన్ని ఇస్రో అవలంబించింది.

నిపుణుల అభిప్రాయం ఏమిటి..?

నిపుణుల అభిప్రాయం ఏమిటి..?

చంద్రయాన్‌-2లో పేలోడ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి అందులోను చంద్రుడిపై నీటి ఆనవాలు ఇతరత్రా ఖనిజాలకు సంబంధించిన పరిశోధనలు చేయాలి కాబట్టి తక్కువ పరికరాలు పంపాల్సిన అవశ్యకత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చంద్రుడికి అవతల వైపు అంటే దక్షిణ ధృవ ప్రాంతంలో ఒక మిషన్‌ను ల్యాండ్ చేయడమనేది తొలిసారి కావడం కూడా తక్కువ పరికరాలను పంపేందుకు కారణమై ఉంటుందని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
ISRO's Chandrayaan 2 is inching ever so closer to the Moon and is all set to reach the moon surface between 1:30 am and 2:30 am on September 7.While the technology of the mission is extremely impressive, it's also the cost-effective nature of the mission that has made Chandrayaan 2 the talk of the town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X