వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

33 మంది రైతులు చనిపోతే నోరు మెదపరేం.. ప్రధాని మోడీపై కాంగ్రెస్ కన్నెర్ర

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన కొనసాగుతోంది. వీరికి వివిధ పార్టీలు, సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. నిరసనలో భాగంగా 33 మంది రైతులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు చేసింది.

ఢిల్లీ సరిహద్దులో గతనెల 26వ తేదీ నుంచి రైతులు నిరసన తెలియజేస్తున్నారని పేర్కొన్నది. మరీ ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని ప్రశ్నించింది. నిరసన చేపట్టి 33 మంది రైతులు చనిపోయినా.. ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించింది. 33 మంది రైతులు చనిపోవడంతో నిన్న (ఆదివారం) ఆల్ ఇండియా కిసాన్ సభ శ్రద్దాంజలి దివాస్ నిర్వహించింది. వీరిలో చాలా మంది రోడ్డు ప్రమాదాలు/ అనారోగ్యం/ చల్లని వాతావరణం వల్ల చనిపోయారు.

Why is PM Modi Silent on Death of 33 Protesting Farmers: Congress

ఎముకలు కొరికే చలిలో భార్య, పిల్లలతో కలిసి రైతులు ఆందోళనకు దిగారు. వారిలో 33 మంది చనిపోతే ప్రధాని నోట ఎందుకు మాట రావడం లేదని అడిగారు. ప్రధాని మోడీకి కాదు హోం మంత్రి అమిషాకు కూడా లేదన్నారు. కానీ ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లేందుకు మాత్రం సమయం ఉందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చల్లని వాతావరణ ఉంది అని.. ఇంట్లో హీటర్ అన్ చేసి ఉంటున్నామని.. మరీ రైతులు రోడ్లపై నిరసన చేస్తే.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు.

ఎవరైతే దేశాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారో.. ప్రజలను ఆదరిస్తున్నారో వారు/ వారి కుటుంబసభ్యులు చలిలో ఉంటే పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మోడీ గురుద్వారాకు వెళ్లారు ఓకే.. ఆందోళన చేస్తే రైతుల వద్దకు ఎందుకు వెళ్లరు అని ప్రశ్నించారు.

English summary
Blaming the Centre for the death of 33 farmers during their ongoing protest, the Congress on Sunday questioned Prime Minister Narendra Modi's "silence" on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X