వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాండర్ ఆచూకీ దొరికినా..: చంద్రయాన్-2పై ఇస్రో శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ లో కీలకమైన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించినప్పటికీ.. దానితో అనుసంధానం కావడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి నిరంతరాయంగా సంకేతాలను పంపిస్తున్నప్పటికీ.. అందులో ఏ ఒక్క దాన్ని కూడా ల్యాండర్ గ్రహించట్లేదు. ల్యాండర్ జాడను పసిగట్టిన 24 గంటలు అవుతోంది. ఈ వ్యవధిలో ఇస్రో శాస్త్రవేత్తలు కొన్ని వందల సంఖ్యలో సంకేతాలను ల్యాండర్ కు పంపించారు. ఆ సంకేతాలకు ల్యాండర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావట్లేదని తెలుస్తోంది. నిరాశ చెందని శాస్త్రవేత్తలు నిరంతరాయంగా వివిధ సాంకేతిక రూపాల్లో సంకేతాలను పంపిస్తూనే ఉన్నారు. వచ్చే రెండు వారాల్లోగా తాము విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానమౌతామని ఇస్రో ఛైర్మన్ శివన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చంద్రుడి ఉపరితల వాతావరణమే కారణమా?

చంద్రుడి ఉపరితల వాతావరణమే కారణమా?

ఇస్రో గ్రౌండ్ స్టేషన్ నుంచి పంపిస్తోన్న సంకేతాలకు విక్రమ్ ల్యాండర్ స్పందించకపోవడానికి చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులే కారణమై ఉంటాయని ఇస్రో శాస్త్రవేత్త మైలాస్వామి అన్నాదురై అభిప్రాయపడ్డారు. చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కూడా ఇందుకు ఓ కారణం అయ్యుంటుందని ఆయన అంచనా వేశారు. మైలాస్వామి అన్నాదురై.. చంద్రయాన్-1 ప్రాజెక్టుకు డైరెక్టర్ గా పనిచేశారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగే సమయంలో సంభవించిన పరిణామాల వల్లే దానితో సంబంధాలు తెగిపోయి ఉంటాయని అన్నారు. ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం మీదే దిగిందనడానికి సహేతుకమైన, శాస్త్రీయబద్ధమైన రుజువు ఇదేనని చెప్పారు. చంద్రుడి మీద దిగిన తరువాత తలెత్తిన కొన్ని అడ్డంకుల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పంపించే సంకేతాలను ల్యాండర్ లోని సిగ్నల్ రిసీవర్లు అందుకోవట్లేదని చెప్పారు.

10 నిమిషాల పాటే అనుసంధానించగలం

10 నిమిషాల పాటే అనుసంధానించగలం

చంద్రయాన్-1 మిషన్ లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే తలెత్తిన విషయాన్ని మైలాస్వామి అన్నాదురై ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రయాన్-1కు చెందిన ఆర్బిటర్ నుంచి వెలువడిన సంకేతాలు ల్యాండర్ కు చేరుకున్నాయని అన్నారు. విక్రమ్ ల్యాండర్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఇస్రో పంపిస్తున్న సంకేతాలకు ఇక ముందైనా ల్యాండర్ స్పందిస్తుందా? లేదా? అనే అంశం మీదే ఈ ప్రాజెక్టు విజయం ఆధారపడి ఉందని చెప్పారు. సాధారణంగా ల్యాండర్ నుంచి ఆర్బిటర్ మధ్య పరస్పర సంకేతాల మార్పిడి యథాప్రకారం కొనసాగుతుంటుందని, ల్యాండర్ కు సంకేతాలు పంపించాలంటే గ్రౌండ్ స్టేషన్ నుంచే సాధ్యపడుతుందని అన్నారు. ల్యాండర్ తో అనుసంధానమైనప్పటికీ అది అయిదు లేదా పది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండకపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎదురైన క్లిష్ట పరిస్థితులను మన శాస్త్రవేత్తలు అధిగమించగలరనే తాను ఆశిస్తున్నానని అన్నారు.

ల్యాండర్ ఆచూకీని కనుగొన్నప్పటికీ..

ల్యాండర్ ఆచూకీని కనుగొన్నప్పటికీ..

కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ - 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు శివన్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ కోసం అన్వేషిస్తున్నామని అన్నారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతూనే వచ్చింది. వారి ప్రయత్నాలు విఫలం కాలేదు. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయిన సుమారు 36 గంటల వ్యవధిలోనే దాన్ని గుర్తించారు. బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను తెగిపోయిన అనంతరం విక్రమ్ ల్యాండర్.. క్రమంగా ఉత్తర ధృవం వైపు కదులుతున్నట్లు తేలింది.

English summary
The obstacles on the lunar surface may have been stopping the lander Vikram from receiving signals, Chandrayaan-1 Director Mylswamy Annadurai said on Sunday. As we have located the lander on the lunar surface, we now have to establish contact with it. The place, where the lander alighted is expected to be not conducive enough for the lander to soft-land. There may be some obstacles, which could have been stopping us from establishing the connection," Mr Annadurai said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X