వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ పరిణామాలు: సిద్దూ రాజీనామా ఎందుకు చేశాడంటే..? సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కింకర్తవ్యం

|
Google Oneindia TeluguNews

పంజాబ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎప్పటినుంచో అమరీందర్ సింగ్ వర్సెస్ సిద్దూ మధ్య విభేదాలు ఉన్నాయి. అవీ ఇటీవల పిక్‌కు చేరగా.. అమరీందర్ సింగ్ సీఎం పదవీకి కూడా రాజీనామా చేశారు. సిద్దుకు అంతకుముందే పీసీసీ చీఫ్ పదవీని కట్టబెట్టారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున దళితనేత చరణ్ సింగ్‌కు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను ఇచ్చారు. అయినా వివాదం సద్దుమణగలేదు. అమరీందర్ సింగ్.. బీజేపీ అగ్రనేతలతో భేటీ అనే వార్తలతో పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ వెంటనే సిద్దూ కూడా రియాక్ట్ అయ్యారు. పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేశారు. ఇదీ పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపింది. ఇంతకీ సిద్దూ రాజీనామా ఎందుకు చేశారు..? పంజాబ్ ప్రభుత్వంపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం పదండి.

క్యాబినెట్ కొలువుదీరిందో లేదో..?

క్యాబినెట్ కొలువుదీరిందో లేదో..?


నవజ్యోత్ సింగ్ సిద్దూ.. పంజాబ్ సీఎం పదవీని ఆశిస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఆయన హై కమాండ్ పెద్దలతో వరస భేటీలు నిర్వహించారు. అమరీందర్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా కూడా చేశారు. కానీ పొసగక రాజీనామా చేశారు. ఒకానొక సమయంలో ఆప్‌లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు పీసీసీ చీఫ్ పదవీ ఇచ్చి గౌరవించింది హై కమాండ్. కానీ ఆయన మాత్రం పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపారు. ఇటీవల చరణ్ జిత్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గం ఇవాళ కొలువుదీరింది. క్యాబినెట్ ప్రమాణం చేసిందో లేదో.. సిద్దూ బౌన్సర్ విసిరారు.

రాణా రాకతోనేనా..?

రాణా రాకతోనేనా..?


చరణ్ మంత్రివర్గంలో రాణా గుర్జిత్ సింగ్‌కు చోటు లభించింది. ఇదీ సిద్దూకు మింగుడు పడలేదు. రాణా ఇదివరకు కూడా మంత్రిగా పనిచేశారు. 10 నెలలు ఆమాత్యుడిగా పనిచేసి.. తర్వాత వైదొలిగారు. అతనిపై ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని మంత్రి పదవీ ఊడింది. ఇప్పటివరకు బానే ఉంది.. కానీ మళ్లీ క్యాబినెట్ బెర్త్ దక్కడాన్ని సిద్దూ జీర్ణించుకోలేకపోయారు. దీంతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని.. చరణ్‌జిత్ నిర్ణయాన్ని ధిక్కరించారు. అతనిని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని కొందరు నేతలు హైకమాండ్‌ను కోరారు. లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో సిద్దూ రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు.

Recommended Video

Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || Oneindia Telugu
కంటిలో నలుసులా..?

కంటిలో నలుసులా..?

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరీందర్/ సిద్దూను చక్కదిద్దేందుకు హై కమాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం మంత్రివర్గం కొలువుదీరింది. రాణా మంత్రి పదవీ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అమరీందర్ పార్టీ వీడతారనే ప్రచారం కొనసాగింది. దానిని ఎలా పూడ్చాలని భావించాలనే సమయంలోనే.. సిద్దు రాజీనామా చేశారు. దీనిపై అమరీందర్ కూడా స్పందించారు. సిద్దుకు స్థిరత్వం లేదని ట్వీట్ చేశారు. అతనికి అంతలా ప్రాధాన్యం ఇవ్వడంతో ఇలా చేస్తున్నారని కామెంట్ చేశారు. మొత్తానికి పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలు చాకచాకగా మారిపోతున్నాయి. దీనిని గాంధీ కుటుంబం ఎలా లీడ్ చేస్తుందో చూడాలీ.. కానీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం తప్పకుండా పడుతుందుని విశ్లేషకులు అంటున్నారు.

English summary
Navjot Singh Sidhu resigns to punjab pcc chief post because of Rana Gurjit Singh’s return to the Punjab cabinet. he is disappointed with the ranas inducted to cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X